జగన్ సర్కార్‌కు మరో షాక్.. సీపీఎస్‌ రద్దు చేయాలని రోడ్డెక్కిన..?

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (16:06 IST)
సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉద్యోగ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ర్యాలీలు, ధర్నాలతో ఉద్యోగులు ఆందోళనలకు దిగారు. 
 
ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. సీపీఎస్‌ విధానంతో ఉద్యోగులకు పింఛన్ రాకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సీపీఎస్‌ రద్దు హామీ ఇచ్చారని.. దాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. 
 
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నరేళ్లుగా ఎదురుచూసినా పట్టించుకోకపోవడంతోనే ఆందోళనబాట పట్టినట్లు ఉద్యోగ సంఘాల నాయకులు వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటికైనా సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే తమ ఆందోళనలను మరింతగా ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. 
 
జగన్ సర్కారుకు వ్యతిరేకంగా తొలిసారి ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైంది. సీపీఎస్ రద్దుపై సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments