Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. 15మంది మృతి.. నిరాశ్రయులుగా 4.48 లక్షల మంది

సెల్వి
సోమవారం, 2 సెప్టెంబరు 2024 (17:04 IST)
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకు 15 మంది ప్రాణాలు కోల్పోగా, ఏడు జిల్లాల్లో 4.48 లక్షల మందికి పైగా నిరాశ్రయులైనారు. ఎన్టీఆర్ జిల్లాలో వర్షం సంబంధిత ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మొత్తం 19 బృందాలు, రాష్ట్ర ఎస్డీఆర్‌ఎఫ్ 20 బృందాలు ప్రభావిత జిల్లాల్లో రెస్క్యూ ఆపరేషన్ల కోసం బరిలోకి దిగాయి.
 
ప్రభావిత ప్రాంతాల్లో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టేందుకు రెండు హెలికాప్టర్లను ఏర్పాటు చేయాలని నేవీ అధికారులను అభ్యర్థించారు. ఇప్పటికే ఒక హెలికాప్టర్ విజయవాడకు చేరుకుంది. చిక్కుకుపోయిన వ్యక్తులను విమానంలో తరలించడానికి, ఆహార పదార్థాలను అందజేసేందుకు.. హెలికాఫ్టర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. 
 
విజయవాడలో ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 80 బోట్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కాకినాడ, ఏలూరు, ప్రకాశం ప్రాంతాల నుంచి మరో 39 బోట్లు విజయవాడకు వెళ్తున్నాయి.
 
సహాయక చర్యల కోసం కృష్ణా, బాపట్ల జిల్లాల్లో మరో 64 బోట్లను ఏర్పాటు చేశారు. విజయవాడ నగరంలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు సహా ఎన్టీఆర్ జిల్లాలో ఏడుగురు మరణించారు. గుంటూరు జిల్లాలో ఐదుగురు మృతి చెందారు. ప్రకాశం జిల్లాలో నీట మునిగి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. 20 జిల్లాల్లో 1.51 లక్షల హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments