Webdunia - Bharat's app for daily news and videos

Install App

మచిలీపట్నంలో 1,500 కిలోల బరువున్న టేకు చేప దొరికిందోచ్!

సెల్వి
సోమవారం, 29 జులై 2024 (12:10 IST)
Dot Fish
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన మత్స్యకారులు ఆదివారం రాష్ట్ర తీరంలో సముద్రంలో సుమారు 1,500 కిలోల బరువున్న భారీ చేపను పట్టుకున్నారు. మూడు రోజుల క్రితం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు కృష్ణాలోని మచిలీపట్నంలోని గిలకలదిండి వద్ద స్థానికులు టేకు చేప అని పిలిచే భారీ చేపతో తిరిగి వచ్చారు.
 
వారి వలలో ఈ భారీ చేప పడటంతో ఆశ్చర్యపోయిన మత్స్యకారులు దానిని బయటకు తీసుకురావడానికి సహాయం కోరారు. దాన్ని బయటకు తీయడానికి క్రేన్‌ను రప్పించుకున్నారు.
 
అలా ఆ భారీ చేపను ఒడ్డుకు చేర్చారు. ఈ చేపను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ చేపను చూసిన గ్రామస్థులు తమ మొబైల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఇకపోతే.. చెన్నైకి చెందిన వ్యాపారులు మత్స్యకారుల నుంచి చేపలను కొనుగోలు చేసినట్లు సమాచారం. 2020లో, దాదాపు మూడు టన్నుల బరువున్న ఒక పెద్ద స్టింగ్రే చేపను అదే జిల్లాలో మత్స్యకారులు పట్టుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments