టెక్నాలజీ వాడకంలో బాబును మించినోడు లేరు... ఏఐతో ప్రెస్మీట్ లైవ్!!

ఠాగూర్
ఆదివారం, 26 జనవరి 2025 (15:18 IST)
ప్రపంచంలో ఏ మూలనైనాసరే అందుబాటులోకి వచ్చే అత్యాధునిక టెక్నాలజీని వాడుకోవడంలో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని మించినవారు మరొకరు లేరు. తాజాగా తన నివాసంలో ప్రెస్మీట్ పెట్టి, దాన్ని ఆర్టిఫిషియల్ టెక్నాలజీ (ఏఐ)తో లైవ్ చేశారు. ఉండవల్లి నివాసంలో ఏఐ కెమెరాలతో ఏర్పాటు చేశారు. ఇందుకోసం తమ సొంత ఖర్చులను వినియోగించారు. 
 
తొలిసారి కెమెరామెన్లు, వీడియోగ్రాఫర్లు లేకుండానే ఏఐ వ్యవస్థతో ప్రెస్మీట్ నిర్వహించారు. కృత్రిమ మేధ సాయంతో ప్రెస్మీట్‌ను లైవ్ కవరేజీ అందించారు. దీనికోసం ఉండవల్లిలోని తన నివాసంలో ఏఐ వ్యవస్థను ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కావడంతో ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసే అవకాశం ఉన్నప్పటికీ మంత్రి నారా లోకేశ్ అంగీకరించలేదు. సొంత నిధులు వెచ్చించి లోకేశ్ స్వయంగా ఈ ఏర్పాట్లు చేయించారు.
 
సమావేశ మందిరంలో నాలుగు కెమెరాలతో మల్టీ వీడియో కెమెరా వ్యవస్థను ఏర్పాటుచేశారు. హాల్‌లోకి ఎంటరైన సీఎం చంద్రబాబు.. ఇందులోని ఓ కెమెరాకు సూచనలు ఇవ్వడంతో లైవ్ ప్రారంభమైంది. చంద్రబాబు దావోస్ పర్యటన విశేషాలు చెబుతుండగా.. సీఎంను కేంద్రంగా చేసుకుని, ఆయన సెంటర్ ఫ్రేమ్‌లో ఉండేలా సర్దుబాట్లు చేసుకుంటూ ఏఐ వ్యవస్థ వీడియో ఔట్‌పుట్ ఇచ్చింది. 
 
కాగా, ప్రెస్మీట్ లైవ్ కవరేజీకి దాదాపు 8 మంది కెమెరామన్లు, సిబ్బంది అవసరం.. అయితే, ఏఐ వ్యవస్థ ద్వారా ఒక్కరితోనే ఈ పనంతా చక్కబెట్టవచ్చు. దీంతో ప్రెస్మీట్ జరుగుతున్న హాల్‌లో వీడియోగ్రాఫర్ల హడావుడి, అనవసర గందరగోళం తప్పుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments