Webdunia - Bharat's app for daily news and videos

Install App

తహశీల్దారుపై ‘అధికార’ దాడి... టిడిపి నాయకులపై కేసు నమోదు

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2015 (09:05 IST)
తాము చెప్పిన పనులు చేయడానికి నిరాకరించిన రెవెన్యూ అధికారిపై తెలుగుదేశం నాయకులు దౌర్జన్యం చేశారు. చివరకు ఆయనపై దాడి చేశారు. తాము చెప్పిన వారికి ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు నిరాకరించారని మండిపడుతూ ఈ చర్యకు పాల్పడ్డారు. అనంతపురంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
పరిటాల సునీత అనుచరులు టీడీపీ నేతల పామురాయి వెంకటేశ్, కాట్నేకాలువ శ్రీనివాసులు, ఎంపీపీ భర్త రవీంద్ర బుధవారం ఉదయం తహశీల్దార్‌ షేక్‌మహబూబ్ బాషాను కలిసేందుకు వచ్చారు. తాము చెప్పినా పట్టాను ఎందుకు రద్దు చేశారంటూ ఆయనతో వాదనకు దిగారు. నిబంధనల ప్రకారం రద్దు చేయాల్సి వచ్చిందన్న ఎమ్మార్వో సమాధానానికి సంతృప్తి చెందని టీడీపీ నేతలు ఆగ్రహాం వ్యక్తం చేశారు. అంతటితో ఆగక టీడీపీ నేత శ్రీనివాస్ ఎమ్మార్వోపై దాడి చేశారు.
 
ఎమ్మార్వో మహబూబ్బాషాపై దాడికి పాల్పడిన టీడీపీ నేత శ్రీనివాస్పై సెక్షన్ 353 కింద కేసు నమోదు చేసినట్లు అనంతపురం డీఎస్పీ మల్లికార్జున వర్మ తెలిపారు. ప్రభుత్వ ఆధికారులపై దాడులకు పాల్పడితే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని ఆయన హెచ్చరించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments