Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల్లో పోటీ చేసే శక్తి ఉంది... కానీ వ్యయాన్ని భరించే స్థోమత లేదు : ఆనం వివేకా

ఎన్నికల్లో పోటీ చేసే శక్తి తనకు ఉందనీ, కానీ ఎన్నికల వ్యయాన్ని భరించే స్థోమత మాత్రం తనకు లేదని నెల్లూరు జిల్లా సోగ్గాడు ఆనం వివేకానంద రెడ్డి చెప్పుకొచ్చారు. టీడీపీ తరపున ఎమ్మెల్సీ టిక్కెట్ కోసం ఆయన ముమ

Webdunia
ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (09:05 IST)
ఎన్నికల్లో పోటీ చేసే శక్తి తనకు ఉందనీ, కానీ ఎన్నికల వ్యయాన్ని భరించే స్థోమత మాత్రం తనకు లేదని నెల్లూరు జిల్లా సోగ్గాడు ఆనం వివేకానంద రెడ్డి చెప్పుకొచ్చారు. టీడీపీ తరపున ఎమ్మెల్సీ టిక్కెట్ కోసం ఆయన ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారనే వార్త గుప్పుమన్నది. దీనిపై వివేకా స్పందించారు. 
 
ఎమ్మెల్సీ పదవిపై తనకు ఆసక్తి ఉందన్నారు. అయితే స్థానిక సంస్థల కోటాలో కాదని, గవర్నర్‌, ఎమ్మెల్యేల కోటాలో వస్తే స్వీకరిస్తానని నర్మగర్భంగా చెప్పారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసే శక్తి తనకున్నప్పటికీ వ్యయాన్ని భరించే స్థోమత లేదన్నారు. తన స్నేహితుడు స్థానిక సంస్థల ఎన్ని కల్లో పోటీచేయనున్నారని, ఆయన గెలుపుకోసం తాము కృషి చేస్తామన్నారు. 
 
ఇకపోతే తనకు, తన తమ్ముడు ఆనం రామనారాయణ రెడ్డికి మధ్య ఎటువంటి విభేదాల్లేవన్నారు. అలాగే, తన సోదరుడు రామనారాయణ రెడ్డికి తెలియకుండా తాను ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నిస్తున్నానన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి నామినేషన్‌, ఎలాగెలిపించుకోవాలనే ప్రణాళికపై మంత్రి నారాయణ, టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుతో తాను, తన సోదరుడు చర్చించారని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments