Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేష్ మధ్యవర్తిత్వం : టీడీపీలోకి ఆనం బ్రదర్స్ ఎంట్రీ ఖాయం!

Webdunia
గురువారం, 21 ఆగస్టు 2014 (16:56 IST)
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బలమైన రాజకీయ నేతలుగా చెలామణి అవుతున్న కాంగ్రెస్ సీనియర్ నేతలైన ఆనం బ్రదర్స్ (ఆనం వివేకానంద రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి)లు సొంత పార్టీకి గుడ్‌బై చెప్పి.. టీడీపీలో చేరడం దాదాపుగా ఖాయమైందని చెప్పొచ్చు. టీడీపీ యువనేత నారా లోకేష్ మధ్యవర్తిత్వం ఫలించడంతో వారు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేందుకు ముందుకు వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
గత ఎన్నికల్లో వీరిద్దరు చిత్తుగా ఓడిపోయిన వీరు ఇపుడు తమ నివాసాలకే పరిమితమయ్యారు. కాంగ్రెస్ పార్టీ చేసిన విభజన పాపం వల్లే తాము ఓడిపోయామని వారు పలు మార్లు బహిరంగంగానే చెప్పారు. అదేసమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వారు ప్రశంసల వర్షం కురిపిస్తూ వచ్చారు. దీనికితోడు బీజేపీ సీనియర్ నేత వెంకయ్య జోక్యం చేసుకుని టీడీపీలో చేర్చుకోవాల్సిందిగా చంద్రబాబును కోరారు. 
 
దీంతో తన తనయుడు నారా లోకే‌ష్‌ను చంద్రబాబు రంగంలోకి దించారు. ఫలితంగా ఆనం బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరడం ఖాయమని తేలిపోయింది. అయితే ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆనం సోదరులు తెలుగుదేశం పార్టీలో చేరడం అక్కడ స్థానికంగా వుండే తెలుగుదేశం నాయకత్వానికి కొంత ఇబ్బంది కలిగించే అంశం కావచ్చు. కొంత వ్యతిరేకత కూడా ఎదురయ్యే అవకాశం వుంది. అందుకే, ఆనం సోదరుల తెలుగుదేశంలో చేరిక సాఫీగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగే బాధ్యతను నారా లోకేష్ తీసుకున్నట్టు తెలుస్తోంది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments