Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌ను కలిసిన సిట్‌ అధికారులు

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (16:47 IST)
విశాఖ భూఅక్రమాలపై ఏర్పాటైన సిట్‌ మధ్యంతర నివేదికను అధికారులు సీఎం వైఎస్‌.జగన్‌కు సమర్పించారు. ఈ మేరకు సిట్‌ ఛైర్మన్‌ డా.విజయ్‌కుమార్‌, సభ్యులు అనురాధ, భాస్కర్‌రావు సీఎంను అమరావతిలో కలిశారు. ఈ సందర్భంగా మొత్తం 1351 ఫిర్యాదులు మాత్రమే ఉన్నట్లు గుర్తించామని అధికారులు సీఎంకు తెలిపారు. 
 
భూ అక్రమాలకు సంబంధించి తప్పులు జరిగినట్లు గుర్తించినట్లు, ఆ అంశాలను నివేదకలో పొందుపర్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ అక్రమాల్లో ఐఏఎస్‌ అధికారుల నుంచి కింది స్థాయి అధికారులు వరకు ఉన్నట్లు వారు తెలిపారు. ఇంకా లోతుగా అధ్యయనం చేయాల్సిన అంశాలు ఉన్నాయని వారు సీఎంకు వివరించారు. 
 
ఈ నెల 31తో సిట్‌ గడువు ముగియనుండడంతో పొడిగించాల్సిన అవసరముందని వారు తెలిపారు. ఈ సందర్భంగా అక్రమాలపై లోతుగా అధ్యయనం చేయాలని సిట్‌ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. అంతేకాకుండా సిట్‌ గడువు పొడిగిస్తున్నట్లు సీఎం జగన్‌ వారికి హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments