Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక‌టా... అమ‌రావ‌తి నిర్మాణానికి బ్రేక్... స్విస్ ఛాలెంజ్ ప‌నుల‌పై హైకోర్టు స్టే

హైదరాబాద్: ఏపీ సీఎం ప‌దేప‌దే చెపుతున్న అమ‌రావ‌తి నిర్మాణానికి బ్రేక్ ప‌డింది... ఏపీ కొత్త రాజ‌ధాని నిర్మాణానికి స్విస్ ఛాలెంజ్ ప‌ద్ధ‌తిలో విదేశీ కాంట్రాక్ట్ నిబంధ‌న‌ల‌ను న్యాయ‌స్థానం వ్య‌తిరేకించింది. దీనితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్ట

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2016 (17:49 IST)
హైదరాబాద్: ఏపీ సీఎం ప‌దేప‌దే చెపుతున్న అమ‌రావ‌తి నిర్మాణానికి బ్రేక్ ప‌డింది... ఏపీ కొత్త రాజ‌ధాని నిర్మాణానికి స్విస్ ఛాలెంజ్  ప‌ద్ధ‌తిలో విదేశీ కాంట్రాక్ట్ నిబంధ‌న‌ల‌ను న్యాయ‌స్థానం వ్య‌తిరేకించింది. దీనితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టులో చుక్కెదురైంది. రాజధాని అమరావతి నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం అనురిస్తున్న స్విస్ చాలెంజ్ విధానంపై హైకోర్టు స్టే విధించింది. స్విస్ ఛాలెంజ్ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. 
 
తదుపరి విచారణను అక్టోబర్ 31కి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ విధానాన్ని ఇందులో కొన్ని అభ్యంత‌రక‌ర‌మైన నిబంధ‌న‌ల్ని ప్ర‌తిప‌క్షాలు వ్య‌తిరేకిస్తున్నాయి. దీనిపై ఆంధ్రప్రదేశ్ తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ప్రపంచ స్థాయి నగర నిర్మాణం కోసమే స్విస్ ఛాలెంజ్ పద్ధతి పాటిస్తున్నట్లు చెప్పారు. 
 
అయితే, ఇందులో కొన్ని మ‌న దేశ నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ఉన్నాయ‌ని న్యాయ‌స్థానం భావించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్ర‌భుత్వం స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని ఎంచుకోవడాన్ని ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్, చెన్నైకు చెందిన ఎన్వీఎన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్య‌తిరేకిస్తూ, న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీనిపై కోర్టు స్టే ఇచ్చింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments