"సెల్ఫీలు ఎవరికీ ఊరికే రావమ్మా... లక్ ఉండాలి" : అల్లు శిరీష్

'డబ్బులు ఊరికే రావు' అనేది లలితా జ్యూవెలరీ ఎండీ కిరణ్ కుమార్‌ డైలాగ్. సెల్ఫీలు ఊరకే రావు అన్నది టాలీవుడ్ యువ హీరో అల్లు శిరీష్‌ది. ఇంతకీ వీరిద్దరి డైలాగుల గురించి ఇక్కడ ప్రస్తావన ఎందుకనే కదా మీ సందేహం

Webdunia
మంగళవారం, 3 జులై 2018 (17:55 IST)
'డబ్బులు ఊరికే రావు' అనేది లలితా జ్యూవెలరీ ఎండీ కిరణ్ కుమార్‌ డైలాగ్. సెల్ఫీలు ఊరకే రావు అన్నది టాలీవుడ్ యువ హీరో అల్లు శిరీష్‌ది. ఇంతకీ వీరిద్దరి డైలాగుల గురించి ఇక్కడ ప్రస్తావన ఎందుకనే కదా మీ సందేహం.
 
నిజానికి లలితా జ్యూవెలరీ ఎండీ గుండు బాస్ (కిరణ్ కుమార్) చెప్పే యాడ్ బుల్లితెరపైనే కాదు.. వెండితెరపై కూడా ఎంతలా పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈయనతో మెగా హీరో అల్లు శిరీష్ దిగిన సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు శిరీష్ చెప్పే డైలాగ్ అందరినీ నవ్వులు పూయిస్తోంది.
 
ఇటీవల అల్లు శిరీష్ విమానంలో ప్రయాణిస్తుండగా ల‌లిత జ్యూయ‌ల‌ర్స్ ఎండీ కిర‌ణ్ కుమార్‌‌ కూడా ఆ విమానం ఎక్కారు. వెంట‌నే ఆయ‌న‌తో క‌లిసి సెల్ఫీ దిగారు. ఆ ఫోటోని మంగళవారం త‌న ట్విట్ట‌ర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. దానికింద.. "సెల్ఫీలు ఎవ‌రికీ ఊరికే రావు. అదృష్టం ఉండాలి. హ‌హ‌హ‌.." అంటూ ల‌లితా జ్యూవెల‌రీ యాడ్‌లో కిర‌ణ్ కుమార్ చెప్పిన స్టైల్లోనే కామెంట్ చేశాడు. 
 
ఈ ట్వీట్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. శిరీష్ న‌టించిన మ‌ల‌యాళ మూవీ తెలుగులో "యుద్ధభూమి" పేరుతో ఈనెల 29వ తేదీన విడుదలకానుంది. ప్రస్తుతం మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్, బిగ్బెన్ సినిమాస్ బ్యానర్‌లపై మధుర శ్రీధర్, యష్ రంగినేని నిర్మిస్తున్న ఏబీసీడీ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. సంజీవ్ రెడ్డి ఈ సినిమాతో  డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. ఇందులో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments