Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు అనంతపురం పవన్‌ కళ్యాణ్ ప్రత్యేక గర్జన.. బహిరంగ సభకు భారీ బందోబస్తు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గురువారం అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ప్రత్యేక గర్జన కోసం సీమాంధ్ర హక్కుల జన చైతన్య సభ పేరుతో నిర్వహిస్తున్న ఈ

Webdunia
గురువారం, 10 నవంబరు 2016 (09:07 IST)
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గురువారం అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ప్రత్యేక గర్జన కోసం సీమాంధ్ర హక్కుల జన చైతన్య సభ పేరుతో నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభ స్థానిక న్యూటౌన్‌ జూనియర్‌ కళాశాల గ్రౌండులో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. 
 
ఈ సభకు వేలాది మంది హాజరవుతున్న నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. దాదాపు 1800 మంది పోలీసులు బందోబస్తు విధుల్లో నిమగ్నమయ్యారు. మరోవైపు ప్రజలు, అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా 600 మంది జనసేన వాలంటీర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
రాయలసీమ జిల్లాల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున వాహనాల్లో తరలిరావచ్చన్న ఉద్దేశ్యంతో ట్రాఫిక్‌ను మళ్లించారు. వాహనాల పార్కింగ్‌ కోసం ప్రత్యేకంగా స్థలాలను ఏర్పాటు చేశారు. బహిరంగ సభను విజయవంతం చేసేందుకు జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్‌ అభిమానులు కృషిచేస్తున్నారు. ఈ సభలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ ఇప్పటికే అనంతపురానికి చేరుకున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments