Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యుత్ కోతలపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దు

Webdunia
శనివారం, 16 అక్టోబరు 2021 (14:29 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో విద్యుత్ కోతలపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపిడిసిఎల్) వినియోగదారులకు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె.సంతోషరావు విజ్ఞప్తి చేసారు. దసరా పండగ తర్వాత శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా (పవర్ కట్) ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ అమల్లోకి వస్తాయని సామాజిక మాధ్యమాల్లో వస్తున్నట్లు సిఎండి దృష్టికి రావడంతో ఆయ‌న ఈ ప్ర‌క‌ట‌న చేశారు. అటువంటి కోతలేవీ లేవని సిఎండి కె.సంతోషరావు స్పష్టం చేసారు. 
 
విద్యుత్ ఉత్పత్తికి అవసరమైనటు వంటి బొగ్గు నిల్వలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చడం వలన విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు లేవని సిఎండి పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా పరిస్థితిపై ఎటువంటి సమాచారం ఉన్నా, సామాజిక మాధ్యమాల ద్వారా కాకుండా, వినియోగదారులకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అధికారకంగా తెలియ చేస్తామన్నారు. కాబ‌ట్టి వినియోగ‌దారులు కంగారుప‌డ‌వ‌ద్ద‌ని  ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపిడిసిఎల్) వినియోగదారులకు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె.సంతోషరావు విజ్ఞప్తి చేసారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments