Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌తో వన్డే సిరీస్ : ఇంగ్లండ్ జట్టులో హాలెక్స్!

Webdunia
బుధవారం, 20 ఆగస్టు 2014 (14:58 IST)
భారత్‌తో స్వదేశంలో ఐదు మ్యాచ్‌ల అంతర్జాతీయ వన్డే సిరీస్‌లో తలపడేందుకు ఇంగ్లండ్ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ట్వంటీ-20 ఫార్మాట్‌లో స్పెషలిస్టు ఆటగాడిగా పేరు తెచ్చుకున్న అలెక్స్ హాలెక్స్ (25)కు తొలిసారి జాతీయ జట్టులో చోటు కల్పించారు. దీంతో అతను కెప్టెన్ కుక్‌తో కలసి ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.
 
హాలెస్ ఇంతకుముందు 32 అంతర్జాతీయ ట్వంటీ-20 మ్యాచ్‌లలో ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించినప్పటికీ అంతర్జాతీయ వన్డేల్లో ఆడే అవకాశం లభించలేదు. అయితే మోకాలి గాయంతో సీమర్ స్టూవర్ట్ బ్రాడ్ వన్డే సిరీస్‌కు దూరమవడంతో అతని స్థానంలో హాలెస్‌కు అవకాశం కల్పించారు. 
 
భారత్‌తో ఐదు వన్డేల సిరీస్ ఈ నెల 25వ తేదీన బ్రిస్టల్‌లో జరిగే మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ పూర్తయిన తర్వాత రెండు జట్లు సెప్టెంబర్ 7వ తేదీన ఎడ్గ్‌బాస్టన్‌లో ట్వంటీ-20 మ్యాచ్‌లో తలపడతాయి.
 
ఇంగ్లాండ్ వన్డే జట్టు వివరాలు:
ఆలిస్టర్ కుక్ (కెప్టెన్), మొరున్ అలీ, జేమ్స్ ఆండర్సన్, గ్యారీ బల్లాన్స్, ఇయాన్ బెల్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), ఇయాన్ మోర్గాన్, జో రూట్, బెన్ స్టోక్స్, జేమ్స్ ట్రెడ్‌వెల్, క్రిస్ వోక్స్, స్టీవెన్ ఫిన్, హారీ గర్నీ, అలెక్స్ హాలెస్, క్రిస్ జోర్డాన్.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments