Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీడిన మిస్టరీ.. సురక్షితంగా ఇంటికి చేరుకున్న స్పందన..!

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2015 (10:36 IST)
రెండు రోజుల క్రితం అదృశ్యమై మిస్టరీగా మారిన అగ్రికల్చరల్ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ స్పందన భట్ కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. సూసైడ్‌నోట్‌ రాసి కనిపించకుండా పోయిన ఆమె స్వయంగా ఇంటికి చేరుకుంది. దాంతో స్పందన భట్ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
గత బుధవారం ఉదయం విధులకు వెళ్లిన స్పందన తన తల్లికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకోబోతున్నానని చెప్పడంతో పాటు డైరీలో సూసైడ్ నోట్ కూడా రాసి అదృశ్యమైన విషయం తెలిసిందే. దాంతో కుటుంబ సభ్యులు వెంటనే మైలార్దేవ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  
 
పోలీసులు కేసు నమోదు చేసి, స్పందన కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆశ్రయించగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మొదట స్పందన జహీరాబాద్లో ఉన్నట్లు గుర్తించారు. అయితే బుధవారం మధ్యాహ్నం నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆమె ఆచూకీ కనిపెట్టడం కష్టతరంగా మారింది.
 
కాగా స్పందన ఏడాది క్రితం హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రాజును వివాహం చేసుకుంది. వారి విచారణలో  పెళ్లయినప్పటి నుంచి రాజు ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటున్నట్టు తెలుస్తోంది. కట్నం డబ్బులతో  రాజు జల్సాలు చేసేవాడన్న ఆరోపణలున్నాయి. 
 
ఏదైనా ఉద్యోగం చేయాలని భర్తకు అనేకసార్లు చెప్పి విసిగిపోయిన స్పందన చివరకు మనస్థాపంతో సూసైడ్‌ నోట్‌ రాసి  అదృశ్యమైనట్టు సమాచారం. అయితే స్పందన క్షేమంగా ఇంటికి రావటంతో కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments