శ్రీవారికి మాత్రమే కాదు.. దుర్గమ్మ, శ్రీశైలం, కాణిపాకానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా...

ఠాగూర్
శుక్రవారం, 20 జూన్ 2025 (09:24 IST)
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు (సిట్) చేస్తున్న విచారణలో విస్తుగొలిపే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఉత్తరాఖండ్‌కు చెందిన భోలేబాబా డెయిరీ తిరుపతి నగరంలోని ఓ చిన్న డెయిరీని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు కల్తీ నెయ్యి సరఫరా చేసినట్టు అధికారులు గుర్తించారు. ఈ ప్రధాన ఆలయాల్లో దుర్గమ్మ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమల వంటి పుణ్యక్షేత్రాలకూ భోలేబాబా సంస్థనే పరోక్షంగా నెయ్యిని సరఫరా చేసినట్టు సిట్ అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు. 
 
తిరుపతిలోని డెయిరీకి కమిషన్లు చెల్లించి ఆ కంపెనీ పేరుతో కల్తీ నెయ్యి పంపినట్టు విచారణాధికారులు నిగ్గు తేల్చారు. ఇప్పటివరకు తితిదేకు మాత్రమే కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని అంతా భావిస్తున్నారు. ఈ తరుణంలో ఏ12గా ఉన్న భోలేబాబా డెయిరీ జనరల్ మేనేజర్ హరి మోహన్‌ రాణా నెల్లూరు ఏసీబీ కోర్టులో మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, ఏపీపీ జయశేఖర్ వ్యతిరేకిస్తూ ఈ నెల 17వ తేదీన తమ వాదనలు వినిపించారు. 
 
ఆ సందర్భంగా ఏపీపీ ఆశ్చర్యకర విషయాలను వెల్లడించారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో నిందితుడు మాస్టర్‌‌మైండ్ అని, బయటకు వస్తే సాక్ష్యాధారాలు మాయం చేస్తారని, సాక్షులను ప్రభావితం చేస్తారని ఏపీపీ వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి సరస్వతి గురువారం బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments