Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ కొత్త ప్రభుత్వ సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్ - నీలం సాహ్నికి లక్కీ ఛాన్స్

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (18:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈయన ఇప్పటివరకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. 
 
ప్రస్తుత ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీలం సాహ్ని పదవీ పొడగింపు కాలం ఈనెల 31వ తేదీతో ముగియనుంది. దీంతో అదే రోజున ఆదిత్యనాథ్ దాస్ సీఎస్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 
 
ఇక తెలంగాణ నుంచి వచ్చిన శ్రీలక్ష్మికి ఏపీ సర్కార్ మున్సిపల్ శాఖ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించింది. అలాగే ఏపీ సాంఘీక సంక్షేమ శాఖ కార్యదర్శిగా కె. సునీత నియామకం అయ్యారు. 
 
ఇక సీఎస్‌గా పదవీ విరమణ పొందనున్న నీలం సాహ్నీని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
వాస్తవానికి నీలం సాహ్ని పదవీకాలం ఎపుడో ముగిసినప్పటికీ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆమె పదవీ కాలాన్ని పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, కేంద్రం కూడా ఆమోదముద్ర వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments