Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపే ఆదిత్య ఎల్-1 ప్రయోగం - ఇస్రో ఛైర్మన్ పూజలు

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (17:08 IST)
సూర్యుడి రహస్యాలను శోధించడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శనివారం ఉదయం 11.50 నిమిషాలకు ఆదిత్య ఎల్1 ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ మిషన్‌కు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ శాటిలైట్‌ను పీఎస్ఎల్వీ సీ57 నింగిలోకి మోసుకెళ్లనుంది. 
 
ఇప్పటికే చంద్రయాన్-3 విజయంతో చరిత్ర సృష్టించిన ఇస్రో... ఇపుడు సూర్యుడి రహస్యాలను తెలుసుకునేందుకు ఆదిత్య ప్రయోగాన్ని చేపడుతుంది. ఈ ప్రయోగంలో భాగంగా శనివారం ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సీ57ను రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్-1ను నింగిలోకి పంపనున్నారు. 
 
శనివారం చేపట్టే ఈ భారీ ప్రయోగం నేపథ్యంలో సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ అమ్మవారి ఆలయంలో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాకెట్ విజయవంతం కావాలని ఆయన పూజలు చేశారు. కాగా, ఈ ప్రయోగం కోసం ఇప్పటికే కౌంట‌డౌన్ ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments