Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు సార్లు ఎమ్మెల్యేనయ్యా.. మర్డర్లు చేస్తామా? : గొట్టిపాటి రవికుమార్

ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ మండలం వేమవరం గ్రామంలో ఫ్యాక్షన్ కక్షల్లో ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గానికి చెందిన ఇద్దరు హత్యకు గురికావడంపై అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌పై విమర

Webdunia
శనివారం, 20 మే 2017 (13:36 IST)
ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ మండలం వేమవరం గ్రామంలో ఫ్యాక్షన్ కక్షల్లో ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గానికి చెందిన ఇద్దరు హత్యకు గురికావడంపై అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌పై విమర్శలు వస్తున్నాయి. టీడీపీలో చేరిన గొట్టిపాటి... కోవర్ట్ రాజకీయాలు చేస్తూ హత్యారాజకీయాలకు తెరలేపాడంటూ కరణం బలరాం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
 
ఈ వ్యాఖ్యలను గొట్టిపాటి ఖండించిన ఆయన మరింతగా మాట్లాడుతూ... ఇప్పటి దాకా మూడుసార్లు తాను ఎమ్మెల్యే అయ్యాయని... ఇలాంటి హత్యారాజకీయాలను ప్రోత్సహించాల్సిన అవసరం తనకు గాని, తన కుటుంబానికి కాని ఎప్పుడూ లేదని అన్నారు. గ్రామంలో జరిగిన ఘటనతో తాము కూడా చాలా బాధగా ఉన్నామని... కొత్తగా టీడీపీలోకి వచ్చిన తాము అందరినీ కలుపుకుని పోయే ప్రక్రియలో ఉన్నామని చెప్పారు.
 
గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో జరిగిన దాడులను తీసుకొచ్చి తమ మీద రుద్దడం మంచి పద్ధతి కాదని అన్నారు. తాము మర్డర్లు చేస్తామా? లేదా? అనే విషయం అందరికి తెలిసిందేనని... తమపై అనవసరంగా నిందలు వేయడం తగదని సూచించారు. తాము హత్యారాజకీయాలను ఎప్పుడూ ప్రోత్సహించమని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తానని... జరిగిన విషయం మొత్తాన్ని ఆయన దృష్టికి తీసుకెళతానని తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

ఆడ పిల్లలు ఎదిగేందుకు తోడ్పాడు అందించాలి : నారి గ్లింప్స్ రిలీజ్ చేసిన మంత్రి సీతక్క

'పుష్ప 2' చిత్ర టికెట్ ధరల పెంపునకు టి సర్కారు అనుమతి

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments