Webdunia - Bharat's app for daily news and videos

Install App

బికినీ షోలకైతే చంద్రబాబు సర్కారు అనుమతిస్తుందా?: ఆర్కే.రోజా

రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం యువత చేస్తున్న ఆందోళనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. బీచ్‌లలో బికినీ షోలకైతే అనుమతిస్తారా అంటూ విమర్శించారు. శాంతియుతంగా నిర్వహించుకు

Webdunia
గురువారం, 26 జనవరి 2017 (11:14 IST)
రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం యువత చేస్తున్న ఆందోళనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. బీచ్‌లలో బికినీ షోలకైతే అనుమతిస్తారా అంటూ విమర్శించారు. శాంతియుతంగా నిర్వహించుకునే కార్యక్రమానికి ఎందుకు మద్దతు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ ప్రత్యేకహోదా వల్లే రాష్ట్ర యువతకు భవిష్యత్తు ఉంటుందన్నారు. దానికోసం పోరాడుతున్న యువతను అణగదొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రదేశాల్లో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి యువత పెద్ద ఎత్తున హాజరై సంఘీభావం తెలపాలని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటే, ప్రభుత్వం గడ్డు పరిస్థితిని ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. 
 
ఏపీకి ప్ర‌త్యేక హోదా కోరుతూ విశాఖ ఆర్కేబీచ్‌లో నేడు నిర్వ‌హించ‌నున్న నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని అడ్డుకుంటామ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యార్థి జేఏసీ ప్ర‌క‌టించింది. జేఏసీ చైర్మ‌న్ అడారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఏపీకి ప్ర‌త్యేక హోదా కోరుతూ చేస్తున్న ట్వీట్ల‌ను జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వెంట‌నే ఆప‌డం మంచిద‌ని హిత‌వు ప‌లికారు. 
 
గ‌ణతంత్ర దినోత్స‌వం రోజున త్రివ‌ర్ణ ప‌తాకానికి వంద‌నం చేసి దేశ‌భ‌క్తిని చాటుకోవాల్సిన స‌మ‌యంలో ప్ర‌త్యేక హోదా కార్య‌క్ర‌మంతో దేశాన్ని అవ‌మానిస్తారా? అని నిల‌దీశారు. ఉద్య‌మం పేరుతో రాష్ట్రానికి అప‌ఖ్యాతి తీసుకువ‌స్తున్నార‌ని విమ‌ర్శించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments