గ‌ల్లా జ‌య‌దేవ్ 'హగ్ ట్రీ' ఛాలెంజ్... సుమంత్ స‌మాధానం..!

సోష‌ల్ మీడియా వేదిక‌గా ఛాలెంజ్ విసిర‌డం... సెల‌బ్రిటీలు ఆ ఛాలెంజ్‌లు స్వీక‌రించ‌డం తెలిసిందే. ఇంత‌కీ ఏమిటి ఛాలెంజ్‌లు అనుకుంటున్నారా..? ఐస్ బ‌కెట్ ఛాలెంజ్, రైస్ బ‌కెట్ ఛాలెంజ్..! ఈ స్టైల్ లోనే కేంద్ర‌ మంత్రి రాజ్యవర్థన్‌ రాథోడ్‌ మొదలుపెట్టిన ఫిట్‌నె

Webdunia
శుక్రవారం, 8 జూన్ 2018 (21:07 IST)
సోష‌ల్ మీడియా వేదిక‌గా ఛాలెంజ్ విసిర‌డం... సెల‌బ్రిటీలు ఆ ఛాలెంజ్‌లు స్వీక‌రించ‌డం తెలిసిందే. ఇంత‌కీ ఏమిటి ఛాలెంజ్‌లు అనుకుంటున్నారా..?  ఐస్ బ‌కెట్ ఛాలెంజ్, రైస్ బ‌కెట్ ఛాలెంజ్..! ఈ స్టైల్ లోనే కేంద్ర‌ మంత్రి రాజ్యవర్థన్‌ రాథోడ్‌ మొదలుపెట్టిన ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ సవాల్‌ను పలువురు సెలబ్రిటీలు ఒకరినొకరు నామినేట్‌ చేసుకుంటూ చేసి చూపించారు. ఇప్పుడు మరో ఛాలెంజ్‌ ప్రారంభమైంది. అదే హ‌గ్ ఏ ట్రీ ఛాలెంజ్‌. ఈ ఛాలెంట్ వైరల్‌ అయింది. 
 
తెలుగుదేశం పార్టీ నాయ‌కుడు ఎంపీ గల్లా జయ్‌‌దేవ్‌ చెట్టును కౌగిలించుకుని, ‘మన జీవితంలో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకు వాటికి ఓ వెచ్చటి కౌగిలిని ఇవ్వడం ద్వారా వేడుక చేసుకుందాం. ఈ ఛాలెంజ్‌ను మీరూ తీసుకోండి అన్నారు. అంతేకాకుండా... మరో అయిదుగురిని ఇందుకోసం నామినేట్‌ చేయండి’ అంటూ ఆయన అశోక్‌ గల్లా, సిద్ధార్థ్‌ గల్లా, సుధీర్‌బాబు, సుమంత్‌, రానా దగ్గుబాటిలకు ఈ ఛాలెంజ్‌ను విసిరారు.
 
గ‌ల్లా ఛాలెంజ్‌కి స్పందించిన సుమంత్‌ తన కుక్కతో పాటు చెట్టును కౌగిలించుకుని ‘నా బాయ్‌తో కలిసి ఛాలెంజ్‌ను పూర్తి చేశా. అఖిల్‌, నాగచైతన్య, సమంత, సుశాంత్‌, కృతి కర్బందాలను నామినేట్‌ చేస్తున్నాను అని సమాధానం ఇచ్చారు. మ‌రి... ఈ హ‌గ్ ట్రీకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vaishnavi: పురుష: నుంచి హీరోయిన్ వైష్ణవి పాత్ర ఫస్ట్ లుక్

ఛాంపియన్ కథ విన్నప్పుడు ఎమోషనల్ గా అనిపించింది : అనస్వర రాజన్

Jin: జిన్ లాంటి కొత్త ప్రయోగాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా : నిఖిల్ ఎం. గౌడ

SS Rajamouli: ఎస్‌ఎస్ రాజమౌళి పై జేమ్స్ కామెరాన్ కామెంట్ వైరల్

Nagarjuna: తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రెండు కోట్ల స్కాలర్‌షిప్ ప్రకటించిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దేశ తొలి మిస్ ఇండియా మెహర్ ఇకలేరు...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

తర్వాతి కథనం
Show comments