Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ .. ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (22:53 IST)
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో 2 వేల జనాభా దాటిన ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. గ్రామాల్లో ఇళ్ల నుంచి సేకరించే చెత్తను తరలించడానికి, రోడ్ల పక్కన పెంచే మొక్కలకు ఆ ట్రాక్టర్ ద్వారానే నీటి తడులు అందించేందుకు ఈ ట్రాక్టర్లు వినియోగించేలా ఆలోచనలు చేస్తోంది.

ఈ ట్రాక్టర్ల నిర్వహణకు అయ్యే వ్యయ భారం సదరు గ్రామ పంచాయతీలపై పడకుండా ప్రభుత్వం మార్గాలను విశ్లేషిస్తుంది. రాష్ట్రంలో 2 వేలకు పైబడి, 5 వేల లోపు జనాభా ఉండే గ్రామాలు 5 వేల పైచిలుకు ఉన్నాయి. వీటికి సొంత ట్రాక్టర్లు అందుబాటులో లేవు. ఈ క్రమంలో 5 వేల లోపు జనాభా కలిగిన 5137 పంచాయతీలకు ట్రాక్టర్లు ఇవ్వాలని ప్రభుత్వం దాదాపు నిర్ణయం తీసుకుంది.

ఇవికాక 5 వేలకు పైబడిన జనాభా కలిగి సొంత ట్రాక్టర్లు లేని పంచాయతీలు 91 ఉన్నాయి. ఆయా పంచాయతీలకు కూడా ట్రాక్టర్లు ఇవ్వాలని భావిస్తోంది. మొత్తం 5,228 గ్రామాలకు ఉచితంగా కొత్తగా ట్రాక్టర్లు అంజేయాలన్నది ప్రభుత్వ యోచన. గ్రామ పంచాయతీ ఇతర అవసరాలకు కూడా ఈ ట్రాక్టర్లను వినియోగించుకునేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments