Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీడీ ఇవ్వలేదనీ...! చెయ్యి తెగనరికేశాడు..!!

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2015 (12:01 IST)
మనిషిని వ్యసనం ఏ స్థాయికైనా దిగజార్చుతుంది. అది ఏ వ్యసనం అనేది ప్రశ్నకాదు. బీడీ సారా, జూదం ఎదైనా కావచ్చు. మనిషి మానసిక స్థితి కుంగదీస్తుంది. కృష్ణా జిల్లాలో సరిగ్గా ఇదే జరిగింది. తన పక్కనున్న వ్యక్తి తనకు బీడీ ఇవ్వలేదని అతనిపై విరుచుకుపడ్డాడో ప్రబుద్ధుడు. చెయ్యి తెగ నరికేశాడు. వివరాలిలా ఉన్నాయి. 
 
కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలంలో సోమవారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన అవుటుపల్లి జోగి(30) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. జోగి సోమవారం ఉదయం పనికి వెళ్లడానికి సెంటర్‌కు వచ్చిన అతను పక్కనే ఉన్న కె.ముసలయ్య(50)ను బీడీ అడిగాడు. అతను ఇవ్వకపోవడంతో కోపోద్రిక్తుడైన జోగి తన చేతిలో ఉన్న కత్తితో ముసలయ్యపై దాడి చేశాడు. 
 
ఈ దాడి నుంచి తప్పించుకోవడానికి ముసలయ్య చేయి అడ్డం పెట్టాడు. జోగీ బలంగా విసిరిన కత్తి ధాటికి ముసలయ్య చేయి తెగి పడిపోయింది.  విషయం తెలుసుకున్న స్థానికులు అతని ఇంటికి వెళ్లి జోగికి దేహశుద్ధి చేశారు. ఇంతలో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని జోగిని అదుపులోకి తీసుకున్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments