Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ప్రియుడు లేని జీవితం నాకొద్దు... సెల్ఫీ తీసుకుని యువతి ఆత్మహత్య

Webdunia
శనివారం, 4 మే 2019 (17:37 IST)
ప్రేమించిన తరువాత ఆ ప్రేమ విఫలమైతే చాలామంది క్షణికావేశాలకు లోనై చనిపోతున్నారు. ఎంతగానో నమ్మి ఒక వ్యక్తిని ప్రేమిస్తే అతను తనను ప్రేమిస్తూ మరో అమ్మాయిని ప్రేమించడాన్ని జీర్ణించుకోలేక  పోయింది ఓ యువతి. సెల్ఫీ వీడియో తీసుకుని మరీ ఆత్మహత్య చేసుకుంది.
 
వైజాగ్ సిటీలో నివాసముంటున్న ఉమా మహేశ్వరి అనే యువతి స్థానికంగా ఉన్న ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. తనతో పాటు పనిచేస్తున్న జాజిబాబు అనే వ్యక్తిని ప్రేమించింది. ఆరు నెలల నుంచి వీరి ప్రేమాయణం సాగుతోంది. అయితే వారం రోజుల నుంచి జాజిబాబు మరో యువతి వసుంధరతో సన్నిహితంగా ఉంటూ కనిపించాడు. ఇది కాస్త ఉమ చూసేసింది. జాజిబాబును నిలదీసింది. 
 
అయితే పెద్దలు ఇద్దరికీ నచ్చజెప్పారు. వారంరోజులు ఉమను తమ బంధువుల ఇంటికి పంపారు తల్లిదండ్రులు. నిన్న బంధువుల ఇంట్లో ఉన్న ఉమ తన ప్రియుడి లేని జీవితం తనకు అవసరం లేదని, తను గాఢంగా జాజిబాబును ప్రేమించానని, అయితే తనను అతను మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. జాజిబాబు, వసుంధరలను అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పింది ఉమ. 
 
సెల్ ఫోన్లో తన బాధను చెబుతూ సెల్ఫీ వీడియో తీసుకుని సుసైడ్ చేసుకుంది. పోలీసులు సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna :డాకూ మహారాజ్ లో మోక్షజ్న ? డాకూ మహారాజ్ కు పార్ట్ 2 వుంటుందా?

మెస్మరైజ్ చేస్తున్న ఉన్ని ముకుందన్ మలయాళ చిత్రం మార్కో

పోరాటాలకు విరామం ఉండ‌ద‌నే కాన్సెఫ్టుతో దక్కన్ సర్కార్ మూవీ

జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారంటూ అభిమాని తల్లి వ్యాఖ్యలు

Sreeleela: బాలీవుడ్ ఐటమ్ సాంగ్‌కు ఓకే చెప్పిందా? ఐటమ్ గర్ల్‌గా శ్రీలీల ఎంట్రీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments