Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతనికి ఇద్దరు భార్యలు, కన్నకూతురిపైనా అత్యాచారం

Webdunia
శుక్రవారం, 17 జనవరి 2020 (17:43 IST)
సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఇది. కన్నకూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి ఆమెపై అత్యాచారం చేశాడు. తండ్రి పాశవిక చర్యను ఎవరికి చెప్పాలో తెలియక ఒకరోజు పాటు కుమిలిపోయింది ఆ కూతురు. చివరకు జరిగిన విషయాన్ని దాచుకోలేక తల్లికి చెప్పేసింది. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో ఘటన చోటుచేసుకుంది.
 
వెదురుకుప్పంలో నివాసముంటున్న ఒక వ్యక్తి కూలీ పనిచేస్తున్నాడు. అతనికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు భార్యలు కూడా ఉన్నారు. పెద్ద భార్య కుమార్తె స్థానికంగా హాస్టల్‌లో ఉంటూ ఆరవ తరగతి చదువుతోంది. పండక్కి ఇంటికి పిలిపించాడు తండ్రి.
 
ఎప్పుడూ హాస్టల్‌లో ఉంటున్నావుగా పండక్కి ఇంటికి రా అంటూ దగ్గరుండి ఇంటికి తీసుకువచ్చాడు. ఇంట్లో అందరూ జల్లికట్టు చూసేందుకు వెళ్ళారు. తన కుమార్తెను మాత్రం వెళ్ళనీయకుండా ఆపాడు తండ్రి. అందరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోగా మృగంగా మారిన తండ్రి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
14వ తేదీ ఘటన జరిగితే కుమార్తె మౌనంగా ఉండిపోయింది. 15వ తేదీ మధ్యాహ్నం జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పింది. దీంతో ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments