Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే హై ఓల్టేజ్ తీగలపై నడవాలని చూశాడు.. చివరికి?

Webdunia
బుధవారం, 13 నవంబరు 2019 (15:04 IST)
రైల్వే విద్యుత్ స్తంభంపైకి ఓ మతిస్థిమితం లేని వ్యక్తి హల్ చల్ చేశాడు. రైల్వే విద్యుత్ స్తంభం పైకి ఎక్కడమే కాకుండా దానిపై వేలాడే హై ఓల్టేజ్‌ తీగలపై నడిచే ప్రయత్నం చేశారు. ఈ ఘటన దబ్రా రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ వ్యక్తి తీగలపై నడిచేందుకు ప్రయత్నిస్తుండగా ఇది గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే ఆ దారిలో ఉన్న విద్యుత్‌ను నిలిపివేసింది. వెంటనే ఆ వ్యక్తిని కాపాడేందుకు సిబ్బంది రంగంలోకి దిగింది.
 
ఈ మొత్తం వ్యవహారంను అక్కడే ఉన్న కొందరు తమ సెల్‌ఫోన్లలో రికార్డు చేశారు. ఈ హై ఓల్టేజ్ డ్రామాను చూసేందుకు ప్లాట్‌ఫాంకు ఇరువైపులా పెద్ద ఎత్తున జనాలు గుమికూడారు. ఇక వారంతా చూస్తుండగానే ఈ వ్యక్తి తీగలపై వేలాడుతూ కొన్ని సర్కస్ ఫీట్లు చేశాడు. ఇక మరో ఇంజిన్‌లో చేరుకున్న రైల్వే సిబ్బంది ఆ వ్యక్తిని కాపాడి కిందకు దించారు. 
 
ఇదిలా ఉంటే ఆ వ్యక్తి చేసిన పనికి చాలా రైళ్లు గంటపాటు నిలిచిపోయాయి. విద్యుత్‌ను అధికారులు నిలిపివేయడంతో ఝాన్సీ రైల్వే డివిజన్‌లోని చాలా వరకు రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గ్వాలియర్‌కు సమీపంలో ఉన్న దాబ్రా రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. విద్యుత్ సరఫరా ఉన్న మరో వైర్‌ను ఆ వ్యక్తి ముట్టుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని రైల్వే అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments