Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌రీక్ష‌లో పాస్...జీవితంలో ఫెయిల్! తొంద‌ర‌ప‌డి ఆ విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌!!

టెన్త్ అంటే... ఎవ‌రికైనా టెన్ష‌నే... టెన్త్ రిజ‌ల్స్ వ‌చ్చాక‌... పేప‌రులో నెంబ‌రు లేక‌పోతే, కొంద‌రు ఎంతో బాధ‌తో కుంగిపోతారు... రకరకాలుగా ఆలోచనలు చేస్తుంటారు. కానీ, కంకిపాడులో ఒక విద్యార్థి రిజ‌ల్స్ రాక ముందే టెన్ష‌న్ ప‌డి... అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడ

Webdunia
మంగళవారం, 10 మే 2016 (16:16 IST)
టెన్త్ అంటే... ఎవ‌రికైనా టెన్ష‌నే... టెన్త్ రిజ‌ల్స్ వ‌చ్చాక‌... పేప‌రులో నెంబ‌రు లేక‌పోతే, కొంద‌రు ఎంతో బాధ‌తో కుంగిపోతారు... రకరకాలుగా ఆలోచనలు చేస్తుంటారు. కానీ, కంకిపాడులో ఒక విద్యార్థి రిజ‌ల్స్ రాక ముందే టెన్ష‌న్ ప‌డి... అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. పరీక్ష‌ల్లో పాస్ అయినా, జీవితంలో ఫెయిల్ అయ్యాడు. కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన విన‌య్ కుమార్ తాను టెన్త్ ప‌రీక్ష‌ల్లో ఫెయిల్ అవుతాన‌ని త‌ప్పుడు అంచ‌నా వేసి, ముందే మ‌న‌స్తాపం చెందాడు. 
 
పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. తీరా రిజ‌ల్ట్స్ చూస్తే, భారీ మెరిట్ సాధించాడు. అత‌నికి 9.3 ప‌ర్సంటేజ్ వ‌చ్చింది. అటు క్విజ్, ఇత‌ర ఆట‌ల్లోనూ బోలెడు మెరిట్ సర్టిఫికెట్లు, మెడ‌ల్స్ సాధించిన విన‌య్ జీవితం ఇలా విషాదాంతం కావ‌డం.. అత‌ని త‌ల్లిదండ్రుల‌కు తీవ్ర మ‌నోవేద‌న మిగిల్చింది. ఐతే పిల్లల్లో ఇలాంటి ఆత్మన్యూనతా భావం లేకుండా, ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనే విధంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అటు ఉపాధ్యాయులపైనే కాకుండా తల్లిదండ్రులపై కూడా ఉంది. కేవలం మార్కులే పరమావధిగా ఆలోచనలు ఉండరాదని గ్రహించాలి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments