Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ పోలీస్: గ్రేహౌండ్స్‌ దళాలకు కోల్ట్‌ 7.62 అమెరికన్ గన్స్!

Webdunia
శుక్రవారం, 22 ఆగస్టు 2014 (12:16 IST)
శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే గ్రేహౌండ్స్ దళాల వల్ల ఆంధ్రప్రదేశ్ పోలీసులకు దేశంలోనే బెస్ట్ పోలీస్‌గా పేరు వచ్చింది. గ్రేహౌండ్స్ దళాల వల్లే రాష్ట్రంలో మావోయిస్టులు పూర్తిగా అదుపులోకి వచ్చారు. ఇంతే కాదు దేశంలోని మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లోని పోలీసులకు కూడా ఏపీ గ్రేహౌండ్స్ దళాలు శిక్షణ ఇస్తున్నాయి. 
 
తాజాగా గ్రేహౌండ్స్ దళాలకు అత్యాధునిక ఆయుధాలను ఇవ్వాలని ఏపీ సర్కార్ నిశ్చయించింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత మావోయిస్టులతో పాటు ఉగ్రవాదుల కార్యకలాపాలు కూడా ఏపీలో మళ్లీ జోరందుకోనున్నాయని నిఘావర్గాలు హెచ్చరించడంతో... ప్రభుత్వం వీరికి ప్రపంచంలోనే అందుబాటులో ఉన్న అత్యాధునిక ఆయుధాలు అందివ్వాలని నిశ్చయించింది. 
 
ప్రస్తుతం మావోయిస్టులు, ఉగ్రవాదులు కూడా ఏకే-47, ఎస్‌ఎల్‌ఆర్‌ లాంటి అత్యాధునిక గన్స్ ను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో... వాటికి మించిన గన్స్‌ను గ్రేహౌండ్స్ దళాలకు అందివ్యాలని ఏపీ పోలీస్ శాఖ నిర్ణయించుకుంది. 
 
ఈ క్రమంలోనే అమెరికాలో ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ ఆయుధ తయారీ కంపెనీ(కోల్ట్‌) నుంచి.... కోల్ట్‌ 7.62 గన్స్‌ను ఆర్డర్‌ ఇచ్చారు. తొలి విడతలో 15 కోట్లు ఖర్చుపెట్టి వెయ్యి గన్స్‌కు ఆర్డర్ ఇచ్చారు. మరో వారం పది రోజుల్లో ఏపీ పోలీసులకు ఈ గన్స్ అందనున్నాయి. 
 
ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుబెట్టిన అమెరికన్ 'సీల్స్' దళాలు ప్రస్తుతం కోల్ట్ గన్స్‌నే వాడుతున్నాయి. ఒసామా బిన్ లాడెన్ మీద ఎటాక్ చేసినప్పుడు సీల్స్ దళాలు వాడినవి కోల్ట్ 7.62 గన్సే కావడం విశేషం.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments