Webdunia - Bharat's app for daily news and videos

Install App

జెత్వానీ కేసు : ఆ ముగ్గురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ పొడగింపు

ఠాగూర్
బుధవారం, 12 మార్చి 2025 (20:14 IST)
ముంబైకు చెందిన సినీ నటి కాదంబరి జెత్వానీ అరెస్టు చేసి ఇబ్బందులు పెట్టిన వ్యవహారంలో ఏపీకి చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను మరో ఆరు నెలల పాటు పొడగిస్తూ, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
జెత్వానీ వ్యవహారంలో ఏపీ నిఘా వర్గం మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిలు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వీరిపై ఇప్పటికే సస్పెన్ష్ వేటుపడింది. ఈ సస్పెన్షన్‌ గడువు బుధవారంతో ముగియడంతో మరో ఆరు నెలలు అంటే వచ్చే సెప్టెంబరు 25వ తేదీ వరకు పొడగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 
 
ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు అఖిల భారత సర్వీస్ నిబంధనలను ఉల్లఘించారనే అభియోగాలపై రివ్యూ కమిటీ సిఫారసు తర్వాత సస్పెన్షన్‌ను పొడగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

ఏజింగ్ మందులు తీసుకోవడం వల్లే షఫాలీ చనిపోయారా?

Bhanu: సంగీత ప్రధానంగా సాగే ప్రేమకథ తో ప్రేమిస్తున్నా ఫస్ట్ సాంగ్ రిలీజ్

వింటేజ్ తరహా సినిమాగా బ్లాక్ నైట్ సాంగ్స్, ట్రైలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments