లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాల్లోని ఎంపీ స్థానాలకు సమన్వయకర్తలను నియమించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమిస్తున్నట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.