Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో పోలీసు కొలువుల భర్తీ... అన్ని విభాగాల్లో కలిపి 15,000 ఖాళీలు

Webdunia
మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (12:27 IST)
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ హోంశాఖ పరిధిలోని పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, ప్రత్యేక రక్షణ దళం (ఎస్‌పీఎఫ్‌) విభాగాల్లో మొత్తం 15వేల పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలందాయి. వీటిలో పోలీసుశాఖలోని సివిల్‌, ఏపీఎస్పీ, ఏఆర్‌ విభాగాల్లో ఎస్సై, ఆర్‌ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సంబంధించి దాదాపు 11వేల పోస్టులున్నాయి. 
 
అగ్నిమాపకశాఖలో స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌, ఫైర్‌మెన్‌, జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్‌, వార్డరు, ఎస్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్‌ తదితర ఉద్యోగాలకు సంబంధించి 4వేల పోస్టులున్నాయి. విభాగాల వారీగా ఉన్న ఖాళీలను సంబంధిత అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. 
 
ఉద్యోగాల భర్తీ కోసం ఏటా ప్రభుత్వం విడుదల చేయనున్న క్యాలెండర్‌లో వీటికి చోటు కల్పించి దశల వారీగా భర్తీ చేయనున్నారు. తొలి దశలో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారనే అంశంపై ఈ నెల మూడో వారం తర్వాత స్పష్టత రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments