Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానంలో 11నెలల పసికందు మృతి.. ఊపిరాడక పోవడంతోనే?

అమెరికా నుంచి హైదరాబాద్‌కు విమానంలో వచ్చిన ఓ 11 నెలల పసికందు మరణించింది. విమానంలో ఊపిరాడక ఆ చిన్నారి కన్నుమూసిందని వైద్యులు నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే.. అమెరికా నుంచి హైదరాబాద్‌ వస్తున్న విమానం

Webdunia
బుధవారం, 26 సెప్టెంబరు 2018 (11:10 IST)
అమెరికా నుంచి హైదరాబాద్‌కు విమానంలో వచ్చిన ఓ 11 నెలల పసికందు మరణించింది. విమానంలో ఊపిరాడక ఆ చిన్నారి కన్నుమూసిందని వైద్యులు నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే.. అమెరికా నుంచి హైదరాబాద్‌ వస్తున్న విమానంలో 11 నెలల శిశువు ఊపిరాడక తెగ ఇబ్బందిపడింది. అయితే విమాన సిబ్బంది ఆ పసికందును కాపాడటానికి విశ్వప్రయత్నాలు చేసినప్పటికి సఫలం కాలేదు. 
 
కానీ ముందస్తుగా హైదరాబాద్ విమానాశ్రయంలో డాక్టర్‌ను ఆంబులెన్స్‌ను సిద్ధంగా వుంచారు. లాండింగ్ అయిన వెంటనే హుటాహుటినా స్థానిక అపోలో మెడికల్ సెంటర్‌కు తరలించారు. కానీ అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తేల్చేశారు. శ్వాస ఆడకనే బిడ్డ చనిపోయిందని చెప్పారు. శిశువు మృతి పట్ల విమాన సంస్థ, సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. 
 
పసికందును కోల్పోయిన తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఆర్నవ్ అనే ఆ చిన్నారి గత ఏడాది అక్టోబర్‌లో అమెరికాలోని న్యూజెర్సీలో జన్మించాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments