Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాడేపల్లి గోశాలలో 100 ఆవుల మృతి

Webdunia
శనివారం, 10 ఆగస్టు 2019 (17:42 IST)
విజయవాడ సమీపంలో ఉన్న కొత్తూరు తాడేపల్లిలోని గోశాలలో సుమారు 80 నుండి 100 ఆవుల వరకు మృతి చెందిన దారుణ సంఘటన. గో సంరక్షణ సంఘం ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఆవులు పెద్ద సంఖ్యలో మృతి చెందడంతో జంతు ప్రేమికులు కన్నీరు పెడుతున్నారు.  నిత్యం ఇక్కడకు ఎంతోమంది వచ్చి గోవులకు సేవ చేస్తుంటారు. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవీ లత, సబ్ కలెక్టర్ మిషా సింగ్ పరిశీలించారు. 
 
కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. "గోసంరక్షణ శాలలో పరిమితికి మించి ఆవులు ఉన్నాయి. పచ్చగడ్డి మోతాదుకు మించి తినడం వల్లే చనిపోయి ఉంటాయని అనుమానం. పచ్చగడ్డిపై ఎరువుల శాతం ఎక్కువుగా ఉందనే అనుమానంపై ల్యాబ్ కు పంపాం. 48గంటల్లో పోస్ట్ మార్టం నివేదిక‌ వస్తుంది. అన్ని కోణాల్లోనూ విచారణ జరుగుతుంది" అని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

గొడ్డలి, జూట్ రోప్ పట్టుకుని హైదరాబాద్‌లో యాక్షన్ సీన్స్ లో నాగచైతన్య షూటింగ్

Court: కోర్ట్ సినిమా నటి శ్రీదేవి కారు కొనేసిందోచ్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments