ఆంధ్రాలో కరోనా ఉగ్రరూపం : 2021 మార్చికి 21 కోట్ల కరోనా కేసులు

Webdunia
బుధవారం, 8 జులై 2020 (15:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఇందులోభాగంగా, గడచిన 24 గంటల్లో 12 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దాంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 264కి పెరిగింది. కొత్తగా 1062 మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 22,259కి చేరింది. 
 
11,101 మంది డిశ్చార్జి కాగా, 10,894 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 255 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 173, తూర్పు గోదావరి జిల్లాలో 125 కేసులు నమోదయ్యాయి.
 
మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 1.12 కోట్లకు పైగా కేసులు నమోదయ్యాయి. ఐదు లక్షల మందికిపైగా చనిపోయారు. మన దేశం విషయానికి వస్తే మొత్తం కరోనా కేసుల సంఖ్య 7.50 లక్షలను సమీపిస్తోంది. ప్రతి రోజు 20వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అమెరికా, బ్రెజిల్ తర్వాత మన దేశంలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.
 
ఈ నేపథ్యంలో కరోనా కేసులపై అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. దీని ద్వారా పలు విషయాలు వెలుగుచూశాయి. 2021 మార్చి వరకు ప్రపంచ వ్యాప్తంగా 25 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదవుతాయని తేలింది. 
 
18 లక్షలకు పైగా ప్రజలు ప్రాణాలను కోల్పోతారని వెల్లడైంది. ఇదేసమయంలో ఇండియాలో ఊహించని విధంగా కేసులు నమోదవుతాయని... రోజుకు 2.8 లక్షల వరకు కేసులు వస్తాయని తేలింది. ఈ అధ్యయనం ఫలితాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments