Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం చేతుల మీదుగా "శ్రీశ్రీ ప్రస్థానత్రయం" ఆవిష్కరణ!

Webdunia
విప్లవకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) శత జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా జరిగాయి. మహాకవి శ్రీశ్రీ శత జయంతి వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య "శ్రీశ్రీ ప్రస్థానత్రయం" అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తక తొలి ప్రతిని రోశయ్య ఆవిష్కరించగా, శ్రీశ్రీ సతీమణి సరోజా శ్రీశ్రీ స్వీకరించారు.

ఇప్పటికే శ్రీశ్రీ సాహిత్యం అనేక సంపుటాలుగా వెలుగులోకి రాగా.. తాజాగా మనసు ఫౌండేషన్ ఆయన సాహిత్యాన్ని మూడు భాగాలుగా విభజించి "శ్రీశ్రీ ప్రస్థానత్రయం"గా ప్రచురించింది.

" శ్రీశ్రీ ప్రస్థానత్రయం" పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య మాట్లాడుతూ.. శ్రీశ్రీపై ప్రశంసల వర్షం కురిపించారు. శ్రీశ్రీ సాహిత్యం ప్రజాజీవనంలో భాగమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

ఇదే కార్యక్రమంలో శ్రీశ్రీ స్వయంగా చదివిన మహాప్రస్థానం గేయాలు, శ్రీశ్రీ ఉపన్యాసాలతో పాటు ఎంపిక చేసిన సినిమా పాటల సీడీనీ ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆవిష్కరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

Show comments