Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి గీతారెడ్డిపై సినీ నిర్మాత అల్లు అరవింద్ ఫిర్యాదు!!

Webdunia
రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి జె.గీతారెడ్డిపై ముఖ్యమంత్రి కె.రోశయ్యకు ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ఫిర్యాదు చేశారు. పైరసీపై ఆమె ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఫలితంగా ఈ పైరసీభూతం తెలుగు చిత్రపరిశ్రమను తీవ్రంగా నష్టపరుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

మరో నిర్మాత దిల్ రాజుతో కలిసి గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి కె.రోశయ్యతో అల్లు అరవింద్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎంకు ఒక వినతిపత్రం సమర్పించారు. చిత్రపరిశ్రమను పట్టిపీడిస్తున్న పైరసీ భూతాన్ని అరికట్టాలని ఆయన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. పనిలో పనిగా గీతారెడ్డిపై అల్లు అరవింద్ ఫిర్యాదు చేశారు.

మంత్రి గీతా రెడ్డి హామీలకే పరిమితమవుతున్నారేగానీ, వాటిలో ఒక్కటి కూడా అమలు చేయడం లేదని అరవింద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన రోశయ్య.. తాను స్వయంగా పరిశీలిస్తానని అరవింద్‌కు హామీ ఇచ్చినట్టు సమాచారం.

ఇటీవల విడుదలైన బృందావనం పైరసీ సీడీలు చెన్నయ్‌లో తయారై మన రాష్ట్రానికి దిగుమతి అయ్యారు. అలాగే, యువహీరో రామ్ చరణ్ నటిస్తున్న ఆరెంజ్ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. దీనికి కూడా పైరసీ భయం పట్టుకుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అక్టోబరు 31వ తేదీన పెళ్లి చేసుకుంటావా? ప్రియురాలికి సినీ దర్శకుడు ప్రపోజ్ (Video)

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ల కిష్కింధపురి ఫస్ట్ లుక్

Sridevi: ఆరోజునే 3డీలోనూ జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్

SS Rajamouli: నా ఎక్స్పెక్ట్ కు మించి నాని చాలా ముందుకు వెళ్లిపోయాడు : ఎస్ఎస్ రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

Show comments