Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ ఓ వేస్ట్ ఫెలో ..ఆయన మాటలు నమ్మొద్దు : రేణుకా

Webdunia
శుక్రవారం, 14 సెప్టెంబరు 2012 (09:19 IST)
File
FILE
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు ఒక వేస్ట్ ఫెలో అని.. ఆయన మాటలను ఎవరూ నమ్మొద్దని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని ఆయన, ఆయన కుటుంబం కోట్లాది రూపాయలకు పడగలెత్తారని ఆమె ఆరోపించారు.

తెలంగాణపై ఈనెలాఖరు నాటికి కేంద్రం ఒక ప్రకటన చేస్తుందంటూ కేసీఆర్ ప్రకటనలు గుప్పిస్తున్న విషయం తెల్సిందే. దీనిపై రేణుక చౌదరి ఘాటుగా స్పందించారు. టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బెదిరింపులకు తమ పార్టీ అధిష్టానం తలొగ్గబోదన్నారు.

గత పదేళ్లుగా చెపుతున్న మాటలనే కేసీఆర్ పదేపదే వల్లె వేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణపై అనేక మార్లు డెడ్‌లైన్లు విధించిన కేసీఆర్.. తాజాగా సెప్టెంబరు నెలాఖరును మరో డెడ్‌లైన్‌గా విధించి, ఢిల్లీలో తిష్టవేసి హడావుడి చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

ఇకపోతే... వచ్చే నెల ఒకటో తేదీన నిర్వహించనున్న జీవ వైవిధ్య సదస్సు కోసం దాదాపు రూ.450 కోట్లు వ్యయం చేస్తున్నట్టు ఆమె తెలిపారు. ఈ సదస్సులో ప్రపంచదేశాలన్నీ పాల్గొననున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సదస్సును విజయవంతంగా చేయాలని రేణుకా చౌదరి విజ్ఞప్తి చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

Show comments