Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా జిల్లాలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Webdunia
కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకు చెందిన మాజీ సర్పంచ్, కాంగ్రెస్‌నాయకుడు గింజుపల్లి వీరయ్యచౌదరిని సోమవారం ఉదయం ఆయన ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపారు.

స్థానికంగానున్న శివాలయంలో పడివున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. నెలరోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు ఆలూరి బుచ్చయ్య చౌదరి అనుమానాస్పదంగా హత్యకు గురయ్యారు.

చౌదరి హత్యకేసులో వీరయ్య ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రతీకారంగానే ప్రత్యర్థులు వీరయ్యను హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కాగా వీరయ్య హత్యకు నిరసనగా విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు రాస్తారోకు నిర్వహించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

Show comments