Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యానుని 151 స్పీడులో పెట్టారు, అందుకే కరెంటు బిల్లులు షాక్, ఈసారి 4లో పెట్టండి: హైపర్ ఆది పంచ్‌లు

ఐవీఆర్
గురువారం, 2 మే 2024 (13:04 IST)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుపు కోసం పిఠాపురం నియోజకవర్గం, దుర్గాడ గ్రామంలో రోడ్ షోలో హైపర్ ఆది ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ... '' వైసిపి ప్రభుత్వం తయారు చేస్తున్న కల్తీ మద్యం తాగిన ఓ వ్యక్తి నా దగ్గరకి వచ్చి హైపర్ ఆదిని అడిగినట్లు చెప్పమంటున్నాడు. కల్తీ మద్యం తాగిన వ్యక్తి ప్రవర్తన ఎలా వుందో అర్థమైంది కదా, అందుకే ఈ కల్తీ ప్రభుత్వాన్ని తరిమివేద్దాం. మొదటిసారి పిఠాపురంలో నేను ఎందుకు పుట్టలేదా అని బాధపడుతున్నా. నేను ఇక్కడ పుట్టి వుంటే నా ఓటును పవన్ కల్యాణ్ గారికి వేసేవాడిని.
 
పవన్ కల్యాణ్ గారికి మీరంతా మీ ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలి. మీ ఇంట్లో మంచి జరిగితే ఓటు వేయమని వైసిపి అడుగుతోంది, కానీ వారింట్లోనే మంచి జరగడంలేదు. వారి చెల్లెళ్లను రోడ్డుపైకి ఈడ్చారు. ఉదయాన్నే డబ్బులు బటన్ నొక్కుతున్నారు, సాయంత్రం మూత తీస్తున్నారు వేసిన డబ్బులకి డబుల్ నొక్కేస్తున్నారు.
 
గత ఎన్నికల్లో మీరు ఫ్యాన్ స్పీడుని 151లో పెట్టారు, అందుకే కరెంటు బిల్లులు విపరీతంగా వస్తున్నాయి. అందుకే ఇప్పుడు మీరు ఫ్యాను స్పీడును రెగ్యులేటర్‌తో 4 లేదా 5లో పెట్టండి. అంతా సరైపోతుంది. వంగా గీత గారు వడదెబ్బ తగిలి పడిపోయారట. ఆ డ్రామాలు నమ్మొద్దండి. మమ్మల్ని ఓడించడానికి అంతా కలిసి వస్తున్నారని అంటున్నారు కదా... ఇంట్లో దొంగ పడితే ఏం చేస్తాము. అందరం కలిసి మూకుమ్మడిగా పట్టుకుని దేహశుద్ధి చేస్తాము. ఇప్పుడు వైసిపి గజదొంగల భరతం పట్టాల్సిన టైం వచ్చింది. వైసిపిని ఓడించి రాష్ట్రాన్ని కాపాడేందుకు మీరు గాజు గ్లాసు గుర్తుకే ఓటెయ్యండి. మీరు గట్టిగా గుద్దే ఓటు దెబ్బకి ఫ్యాను కొట్టుకుపోవాలి.''
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments