Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటరు గుర్తింపు కార్డు లేదా? డోంట్‌వర్రీ అంటున్న ఈసీ

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2019 (15:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఏప్రిల్ 11వ తేదీ ఉదయం నుంచి పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు పొరుగు రాష్ట్రాల్లో నివశిస్తున్న ఏపీ ఓటర్లు సొంతూళ్లకు క్యూకట్టారు. అలాగే, స్థానికంగా ఉండే ఓటర్లలో చాలా మందికి ఎన్నికల సంఘం ఇచ్చిన ఓటరు గుర్తింపు కార్డులు ఉండవు. 
 
ఇలాంటి వారు ఏ విధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్న సందేహం వారిని వెంటాడుతూ ఉంటుంది. ఇలాంటివారికి ఎన్నికల సంఘం ఊరటనిచ్చే విషయాన్ని చెప్పింది. ఎన్నికల సంఘం ప్రకటన మేరకు మొత్తం 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదేని ఒక గుర్తింపు కార్డును తీసుకెళ్లి ఓటు హక్కును వినియోగించుకోచ్చని సలహా ఇచ్చింది. ఆ 11 రకాల గుర్తింపు కార్డులు ఏంటో ఓసారి తెలుసుకుందాం. 
 
1. డ్రైవింగ్ లైసెన్స్
2. పాస్‌పోర్టు
3. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసిన గుర్తింపు కార్డులు
4. బ్యాంకులు, పోస్టాఫీసులు ఫోటోతో సహా జారీచేసిన పాస్ పుస్తకాలు
5. పాన్‌కార్డు 
6. ఎన్పీఆర్ కింద ఆర్జీఐ జారీచేసిన స్మార్ట్ కార్డు
7. జాతీ ఉపాధి హామీ పత్రం 
8. ఆరోగ్య బీమా కింద కేంద్ర మంత్రిత్వ శాఖ జారీచేసిన స్మార్ట్ కార్డు
9. ఫోటోతో కూడిన పింఛన్ ధృవీకరణ పత్రాలు
10. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జారీ చేసిన గుర్తింపు పత్రం. 
11. ఆధార్ కార్డు

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments