మారుతీ రావ్ న్యాయవాది వెంకట సుబ్బారెడ్డి, మారుతి రావు అనుమానాస్పద మృతి కేసులో కీలకంగా మారాడు. అడ్వకేట్ వెంకట సుబ్బారెడ్డి, మారుతి రావు తనను కలిసేందుకు హైదరాబాద్ వచ్చాడని తెలియచేశారు. మారుతీరావు కూతురుతో కాంప్రమైజ్ కావడం కోసం ప్రయత్నం చేశాడని, కూతురు అమృత కోసం కొంతమంది వ్యక్తులను పంపించి మారుతిరావు కేసు కాంప్రమైజ్ కోసం ప్రయత్నించాడని అన్నారు.
అమృత తండ్రి పైన మరో రెండు కేసులు పెట్టడంతో మనస్థాపానికి గురయ్యారని, కూతురు అంటే అమితమైన ప్రేమ కూతురు కోసం ఏమైనా చేసేందుకు సిద్ధపడ్డ వ్యక్తి మారుతీ రావ్, కులాంతర వివాహం చేసుకోవడంతో తీవ్రస్థాయిలో వేదనకు గురైన మారుతి రావు అమృత వేరే వివాహం చేసుకున్నాక ఇంటికి వస్తుంది అని అనుకున్నాడు.
గత శుక్రవారం రోజున తను మిర్యాలగూడలో కలిసాను. వివాహం చేసుకున్నాక వస్తుందని అనుకున్నాడు. కూతురు రాకపోవడంతో మనో వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్టు తెలియజేశారు. ప్రణయ్ కేసులో జీవిత శిక్ష పడుతుందని మారుతీ రావ్‌కు తెలుసు. కేసు ట్రయల్ కాకముందే అమృత మారుతుంది అనుకున్నాడు. కూతురు మారకపోవడం, ఆమె తన వద్దకు రావట్లేదనే బాధతో చనిపోయినట్లు అతడు చెపుతున్నాడు.