Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెన్నైలో కరోనా వైరస్... జీహెచ్‌లో చికిత్స...

చెన్నైలో కరోనా వైరస్... జీహెచ్‌లో చికిత్స...
, సోమవారం, 9 మార్చి 2020 (14:48 IST)
తమిళనాడు రాష్ట్రంలో కూడా ఒక కరోనా వైరస్ నమోదైంది. ఇటీవల ఒమెన్ దేశానికి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. అతని సొంతూరు కాంచీపురం. ప్రస్తుతం ఈ రోగిని చెన్నైలో రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 
 
ఒమన్ దేశం నుంచి తిరిగివచ్చిన తర్వాత దగ్గు, జ్వరంతో బాధపడటమే కాకుండా శ్వాసపీల్చడం కూడా కష్టతరంగా మారింది. దీంతో స్థానికంగా ఉండే ప్రధాన ఆస్పత్రికి వెళ్లగా, అక్కడ వైద్యులు జీహెచ్‌కు వెళ్లాలని చూసించారు. దీంతో ఆ రోగి జీహెచ్ ఆస్పత్రికి రాగా, అతన్ని ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించగా, కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. 
 
కాగా, కరోనా వైరస్‌పై ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖామంత్రి సి.విజయభాస్కర్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇందులో రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని చెప్పారు. అలా ప్రకటన చేసిన మరుసటి రోజే కరోనా కేసు నమోదైంది. అలాగే, రాష్ట్రంలో మొత్తం 54 మందికి శాంపిల్స్ సేకరించి పూణెకు పంపించారు. మరో 1243 మంది అనుమానితులను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. 
 
మరోవైపు, దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 43కు పెరిగాయి. తాజాగా జమ్ము కాశ్మీరులో తొలి కేసు నమోదైందని, 63 ఏళ్ల మహిళకు వైరస్ పాజిటివ్ వచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. ఢిల్లీ, యూపీల్లోనూ రెండు కేసులు నమోదయ్యాయని తెలిపింది.
 
ఇరాన్ నుంచి వచ్చిన జమ్మూ మహిళకు వ్యాధి నిర్ధారణ అయిందని, ప్రస్తుతం ఆమెకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చికిత్సను అందిస్తున్నామని, ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించింది. కాగా, ఆదివారం కేరళకు చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురికి వైరస్ పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. వీరిలో ఇద్దరి వయసు 90 సంవత్సరాలు దాటి వుండటంతో, వారి పరిస్థితిపై ఆందోళన నెలకొంది.
 
అలాగే, విదేశాల నుంచి వచ్చే ఏ నౌకకూ భారత నౌకాశ్రయాల్లో లంగర్ వేసేందుకు అవకాశం ఇవ్వరాదని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 3కు ముందు ఇటలీ, ఇరాన్, సౌత్ కొరియా, జపాన్ తదితర దేశాల నుంచి భారత్‌కు వచ్చే వారికి ఇచ్చిన ఈ-వీసాలన్నీ ఇప్పటికే రద్దయిన సంగతి తెలిసిందే. 
 
దేశం మొత్తం మీద వైరస్ పరీక్షల నిమిత్తం 52 అత్యాధునిక ల్యాబొరేటరీలను ఏర్పాటు చేశామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో 57 ల్యాబొరేటరీలకు అనుమతులు ఇచ్చామని పేర్కొంది. ఇదిలావుండగా, బెంగళూరులోని కిండర్ గార్టెన్ స్కూళ్లన్నీ ముందు జాగ్రత్త చర్యగా మూసివేయాలని యడియూరప్ప సర్కారు ఆదేశించింది. కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు వైరస్ సోకిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు ప్రకటించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కులం పిచ్చితో ఓ కుటుంబం చిన్నాభిన్నం : నటి మాధవీలత