Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కట్టుకున్న భార్యకు విడాకులిచ్చాడు, ఫ్రెండ్ భార్యను తగులుకున్నాడు, వద్దన్నందుకు...

Advertiesment
కట్టుకున్న భార్యకు విడాకులిచ్చాడు, ఫ్రెండ్ భార్యను తగులుకున్నాడు, వద్దన్నందుకు...
, శనివారం, 3 ఏప్రియల్ 2021 (09:33 IST)
తను కట్టుకున్న భార్యతో మనస్పర్థల కారణంగా విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత తన ప్రాణస్నేహితుడితో తన బాధను చెప్పుకుంటూ అలాఅలా అతడి ఇంటికి రావడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో మెల్లగా స్నేహితుడు భార్యనే లొంగదీసుకున్నాడు. తన ఫ్రెండ్ బయటకు వెళ్లినప్పుడల్లా వచ్చి అతడి భార్యతో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. ఇరుగుపొరుగువారు చూసి చెప్పడంతో స్నేహితుడిని తీవ్రంగా మందలించాడు. అంతే... నాకే అడ్డు చెప్తావా అంటూ అంతం చేసాడు. 
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఏరియా మహ్మదికి చెందిన రామకృష్ణ, ఇంద్రపాల్ స్నేహితులు. భార్యతో గొడవల కారణంగా ఇంద్రపాల్ విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత స్నేహితుడు రామకృష్ణతో తన బాధను చెప్పుకుంటూ వుండేవాడు. అలా ఇంటికి వస్తూ పోతూ ఫ్రెండ్ భార్యను లొంగదీసుకున్నాడు.
 
స్నేహితుడు లేనప్పుడల్లా ఆమెతో ఎంజాయ్ చేయడం ప్రారంభించాడు. ఇది కాస్తా రామకృష్ణకు తెలిసి తీవ్రంగా మందలించాడు. దాంతో రెచ్చిపోయిన ఇంద్రపాల్.. పూటుగా మద్యం సేవించి పట్టపగలే రామకృష్ణ ఇంటికి వచ్చాడు. నాకే ఎదురు చెప్తావా అంటూ తుపాకీ తీసుకుని తొలుత రామకృష్ణ భార్యను తలపై పెట్టి కాల్చి చంపేశాడు.
 
ఆ తర్వాత రామకృష్ణపైన కాల్పులు జరిపి చంపేశాడు. ఇరుగుపొరుగువారు ఈ దారుణాన్ని చూసినా వారించలేకపోయారు. అతడి చేతిలో తుపాకీ వుండటంతో పట్టుకునేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. దానితో అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యువతలో పఠనాసక్తిని పెంపొందించాలి: ఉపరాష్ట్రపతి