ఆక్టోపస్‌కు కోపం వచ్చింది... సరదాగా సముద్ర స్నానానికి వెళితే ఒంటి మీద ఓ చరుపు చరిచిందని ఓ వ్యక్తి వాపోయాడు. ఈ ఘటన పశ్చిమ ఆస్ట్రేలియా బీచ్‌లో జరిగింది. ఈత కొట్టడానికి వెళ్లిన ఒక వ్యక్తిపై ఆక్టోపస్ దాడి చేసింది. భూవిజ్ఞాన శాస్త్రవేత్త అయిన లాన్స్ కార్ల్‌సన్ సెలవులు గడపడానికి బీచ్ ఒడ్డుకు వెళ్లారు. ఆయన సముద్రంలో ఈత కొడుతుండగా ఆక్టోపస్ దాడి చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
అది కార్ల్‌సన్‌ను వెంబడిస్తూ తన టెంటకిల్స్ (చేతులు)తో ముందు భుజం మీద చరిచింది. తరువాత మెడ మీద, వీపు మీద కొరడా దెబ్బలు కొట్టినట్టు కొట్టింది. ఆక్టోపస్ కొట్టిన దెబ్బలకు కార్ల్‌సన్ శరీరంపై ఎర్రగా తట్లు తేరాయి. దెబ్బలపై కూల్‌డ్రింక్ పోస్తే గానీ తగ్గలేదని ఆయన వివరించారు. తన రెండేళ్ల కూతురిని తీసుకుని దానికి దగ్గరగా వెళ్లినప్పుడే అది ఆక్టోపస్ అని తెలిసింది. దానికి వీడియో తీస్తుండగా, అకస్మాత్తుగా అది వీళ్లవైపు తిరిగిందని కార్ల్‌సన్ చెప్పారు.