Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పర్ఫామెన్స్ ఇంకా గేమింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సోనీ నుంచి కొత్త INZONE హెడ్‌సెట్‌

Advertiesment
image
, సోమవారం, 10 అక్టోబరు 2022 (22:57 IST)
సోనీ ఇండియా ఈరోజు INZONE ప్రకటించింది, PC గేమర్‌ల కోసం సెన్సెస్‍కు పదును పెట్టి గేమింగ్ సామర్థ్యాన్ని పెంచే కొత్త గేమింగ్ గేర్ బ్రాండ్. INZONE హెడ్‍సెట్‍ల లైనప్‍లో రెండు కొత్త వైర్‍లెస్ హెడ్‍సెట్లు ఉంటాయి, 32 గంటల బ్యాటరీ లైఫ్‍తో INZONE H9-1 అలాగే 40 గంటల బ్యాటరీ లైఫ్‍తో INZONE H7 ఉంటాయి, వాటి వెంట INZONE H3, ఒక వైర్డ్ హెడ్‍సెట్ ఉంటుంది.
 
మూడు మోడళ్లు మ్యూట్ ఫంక్షన్‌తో కూడిన ఫ్లెక్సిబుల్ ఫ్లిప్-అప్ బూమ్ మైక్రోఫోన్, నాయిస్ క్యాన్సిలింగ్ ఇంకా యాంబియంట్ సౌండ్ మోడ్‌లు, మెరుగైన గేమ్‌ప్లే కోసం ఇంటర్‌ ఆపరేబిలిటీ, 360 స్పేషియల్ సౌండ్, 7.1 సిహెచ్ సరౌండ్ సౌండ్‍తో ఉండి స్క్వాడ్ సభ్యులతో గేమ్‌లో సునాయాసంగా కమ్యూనికేట్ చేయడానికి అలాగే ఆప్టిమైజ్డ్ అకౌస్టిక్స్ పొందడానికి యూజర్‍లకు వీలు కల్పిస్తుంది.
 
1. ఖచ్చితమైన టార్గెట్
గేమింగ్ క్రియేటర్లు ఉద్దేశించిన విధంగా INZONE Hub PC సాఫ్ట్వేర్ ద్వారా యాక్టివేట్ చేయబడిన గేమింగ్ కోసం సోనీ 360 స్పేషియల్ సౌండ్ 7.1ch సరౌండ్ సౌండ్‍లో 2ch స్టీరియో ఆడియో సిగ్నల్‌లను రిప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఖచ్చితమైన సౌండ్ రిప్రొడక్షన్ అనేది స్పేషియల్ అవగాహనను పెంచి, ప్లేయర్ అడుగుజాడలను, కదలికలను ఖచ్చితంగా వినడానికి వీలు కల్పిస్తుంది. అలాగే, స్మార్ట్‌ఫోన్ యాప్ “360 స్పేషియల్ సౌండ్ పర్సనలైజర్”తో, నిజంగా పర్సనలైజ్ చేయబడిన గేమ్‌ప్లే కోసం స్పేషియల్ సౌండ్‍ని వారి చెవి ఆకారానికి ఆప్టిమైజ్ చేయించుకుంటారు.
 
2. అడ్వాన్స్డ్ టెక్నాలజీ అకౌస్టిక్స్‍ని ఆప్టిమైజ్ చేస్తుంది
హెడ్‍ఫోన్ టెక్నాలజీలో సోనీ ఎక్స్పర్ట్ నైపుణ్యం నుంచి అభివృద్ధి చేయబడిINZONE H9 అలాగే INZONE H7 యొక్క డయాఫ్రమ్‌లు రెండూ ప్రత్యేకమైన షేప్ కలిగి ఉంటాయి, ఇవి హెడ్‌ఫోన్‌లు అధిక కంప్లయెన్స్‍తో ఎంతో అధిక ఫ్రీక్వెన్సీ సౌండ్‌లను, అలాగే లీనమయ్యే గేమింగ్ అనుభవం కోసం ప్రామాణికమైన తక్కువ ఫ్రీక్వెన్సీలను రిప్రొడ్యూస్ చేయడానికి హెడ్‍ఫోన్‍లను అనుమతిస్తాయి. లోతైన సౌండ్‍లు నమ్మశక్యం కానంత వాస్తవంగా ఉండే విధంగా చేసే పవర్‍ఫుల్ బాస్ కోసం INZONE H9, INZONE H7 అలాగే INZONE H3 హౌసింగ్‌పై ఉన్న డక్ట్‌లు తక్కువ-ఫ్రీక్వెన్సీ సౌండ్ రీప్రొడక్షన్‌ని ఆప్టిమైజ్ చేస్తాయి.
 
3. హాయిగా గంటల తరబడి ఆడండి
వెడల్పాటి, మృదువైన హెడ్‌బ్యాండ్ కుషన్ ఎక్కువసేపు ధరించే సౌకర్యం కోసం ప్లేయర్ తలపై బరువును సమానంగా వ్యాపింపజేస్తుంది. వారి తలకు తగలడాన్ని ఆప్టిమైజ్ చేయడం ద్వారా ఇయర్‌ప్యాడ్‌లు ప్లేయర్ చెవులపై ఒత్తిడిని తగ్గించేలా షేప్ చేయబడ్డాయి.
 
4. నాయిస్ క్యాన్సిలింగ్, యాంబియంట్ సౌండ్ మోడ్
చప్పుడు చేసే హీటర్లు ఇంకా PC ఫ్యాన్ల నుండి బయట బిగ్గరగా నిర్మాణం పనుల వరకు, పనితీరుకు భంగం కలిగించే ఏదైనా శబ్దాన్ని నివారించే నాయిస్ క్యాన్సిలింగ్ మైక్రోఫోన్లను, INZONE H9 కలిగి ఉంది. గేమింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి, ఓడించలేని గేమింగ్ కోసం ఇండస్ట్రీ-లీడింగ్ 1000X సిరీస్ హెడ్‌ఫోన్‌లలో ఉపయోగించిన అదే డ్యూయల్ నాయిస్ సెన్సార్ టెక్నాలజీని Sony పొందుపరిచింది.
 
5. మెరుగైన గేమ్‌ప్లే కోసం ఇంటర్‌ఆపరబిలిటీ
PlayStation 5 కోసం పర్ఫెక్ట్:  INZONE H9 మరియు INZONE H7 ఆన్-స్క్రీన్ సూచనలను కలిగి ఉంటాయి, కాబట్టి ప్లేయర్‌లు తమ హెడ్‌సెట్‌పై సెట్టింగ్‌లను సులభంగా అడ్జస్ట్ చేసుకుని PlayStation 5 కంట్రోల్ సెంటర్‌లో స్క్రీన్‌పై గేమింగ్ మరియు చాట్ బ్యాలెన్స్‌తో పాటు సెట్టింగ్‌లు రిఫ్లెక్ట్ అవడం చూడవచ్చు, ఇది హెడ్‍సెట్ నుండి గేమ్ ఆడియో అలాగే వాయిస్ చాట్ మధ్య వాల్యూమ్ బ్యాలెన్స్‌ను మార్చడానికి ప్లేయర్లను అనుమతిస్తుంది.
 
6. స్థిరత్వం దృష్టిలో పెట్టుకుని
సోనీ ప్రోడక్ట్ ప్యాకేజింగ్ మెటీరియల్ ప్లాస్టిక్-లేనిది. అలాగే రీసైకిల్ చేసిన మెటీరియల్స్, నేయబడని సెల్యులోజ్‌ను మాత్రమే ఉపయోగిస్తుంది, ఇది ప్రోడక్టుల, ఇంకా అభ్యాసాల పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడంలో సోనీ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లోన్ యాప్‌ల ఆగడాలకు ఇక బ్రేక్.. టోల్ ఫ్రీ నెంబర్ రెడీ..