Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జియోగేమ్స్‌లో "చోటా భీమ్".. వేసవిలో చిన్నారులకు బిగ్ ట్రీట్

Chhota Bheem
, బుధవారం, 4 మే 2022 (18:40 IST)
Chhota Bheem
ఛోటా భీమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశంలో అత్యంత గుర్తింపు పొంది, చిన్నారులు అత్యంత ఇష్టపడే పాత్రలలో ఒకటి. ప్రస్తుతం ఛోటాభీమ్ ఫ్యాన్సుకు సమ్మర్ బోనస్ సిద్ధంగా వుంది. ఫలితంగా జియోగేమ్స్ ఈ వేసవిలో "చోటా భీమ్"ను తమ గేమింగ్ ప్లాట్ ఫామ్‌కు స్వాగతించడానికి రెడీ అవుతోంది.
 
స్వచ్ఛమైన హృదయంతో ధోవతి ధరించిన బాలుడు భీమ్, తన నమ్మకమైన స్నేహితులతో కలిసి, ప్రపంచవ్యాప్తంగా సరదాగా, ప్రజలకు సహాయం చేస్తూ నమ్మశక్యం కాని సాహసకృత్యాలకు వెళ్తాడు. ప్రస్తుతం ఈ ఛోటా భీమ్‌ను జియో గేమ్స్ ప్రపంచానికి ఆహ్వానించడం జరిగింది.  
 
చోటా భీమ్ ఈ వేసవిలో జియోగేమ్స్‌లో అనే కొత్త ఇంట్లోకి ప్రవేశించాడు. జియోగేమ్స్, గ్రీన్ గోల్డ్ యానిమేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లు జియోగేమ్స్ ప్లాట్ ఫామ్‌పై చోటా భీమ్ గేమ్‌లను లాంఛ్ చేయడం ద్వారా సమ్మర్ వెకేషన్‌లో పిల్లలకు ఫన్‌‌ను జోడిస్తాయి. 
 
దీనిపై గ్రీన్ గోల్డ్ యానిమేషన్, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ శ్రీ శ్రీనివాస్ చిలకలపూడి మాట్లాడుతూ.. పిల్లలు, గేమింగ్ ఔత్సాహికులు ఇప్పుడు వారి అభిమాన చోటా భీమ్ ఆటను జియోలో పట్టుకోవచ్చు. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు, జియో సెట్-టాప్ బాక్స్ వంటి ప్లాట్ ఫార్మ్‌లలో ఉన్న జియోగేమ్స్ యాప్‌లో ఈ గేమ్స్ అందుబాటులో ఉన్నాయి.  
 
ఇంకా మాట్లాడుతూ.. 'జియోతో అసోసియేట్ కావడం, జియోగేమ్స్‌లో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. జియోగేమ్స్‌లో భారతదేశం అభిమాన యానిమేటెడ్ షో చేరుతుంది.  ఛోటా భీమ్ తప్పకుండా జియో గేమ్స్‌తో కలవడం ద్వారా భారీ స్థాయిలో అభిమానులను సంపాదిస్తాడని చెప్పారు. అలాగే 5 హైపర్ క్యాజువల్ గేమ్‌లను కూడా ఆవిష్కరించనున్నట్లు శ్రీనివాస్ వెల్లడించారు.  
 
గ్రీన్ గోల్డ్ యానిమేషన్ గురించి:
భారతదేశంలోని ప్రముఖ స్టూడియోలలో ఒకటైన గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సంస్థ.. ఒరిజినల్ ఇండియన్ యానిమేషన్ కంటెంట్‌ను సృష్టించడంలో ఒక మార్గదర్శకంగా ఉంది. 15 సంవత్సరాలకు పైగా యువ తరాన్ని అలరిస్తోంది. గ్రీన్ గోల్డ్ నిర్మించిన షోలు అన్ని ప్రముఖ కిడ్స్ టీవీ ఛానళ్లలో బాగా ప్రాచుర్యం పొందాయి. 100 మిలియన్లకు పైగా పిల్లల చురుకైన వీక్షకులను ఆకర్షించాయి. 
 
భారతదేశం నుండి 11 ఒరిజినల్ ఐపిలు, ఏకైక నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ (యానిమేషన్) నిర్మాత, గ్రీన్ గోల్డ్ యానిమేషన్ ప్రస్తుతం 190 దేశాలలో రాణిస్తోంది. 
 
జియోగేమ్స్ గురించి:
భారతీయులందరికీ గేమింగ్ ప్రపంచాన్ని తీసుకురావడానికి జియోగేమ్స్ ఈ ప్రతిష్టాత్మక జర్నీ ప్రారంభించింది. ఇది గేమింగ్ ప్రపంచం నుండి బహుళ వాటాదారులను ఒకచోటకు తీసుకువచ్చే ఫ్లాట్ ఫామ్. వన్-స్టాప్ హబ్ - గేమర్లు, గేమ్ పబ్లిషర్లు, ప్రేక్షకులు, మరియు గేమింగ్ కమ్యూనిటీలను జియోగేమ్స్ ఏకం చేస్తుంది.
 
స్మార్ట్ ఫోన్లు, ఫీచర్ ఫోన్లు, సెట్-టాప్ బాక్స్ ద్వారా హోమ్ గేమింగ్ వంటి బహుళ పరికరాల్లో జియోగేమ్స్ పొందవచ్చు. లైవ్ స్ట్రీమింగ్, ఎస్పోర్ట్స్ అవకాశాలు, క్లౌడ్ టెక్నాలజీ ద్వారా నడిచే గేమింగ్‌లను ఎనేబుల్ చేస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, జియోగేమ్స్ అన్నీ గేమింగ్ సంస్థలకు కొత్త కేంద్రంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. మరింత సమాచారం కొరకు, jiogames.com సంప్రదించవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనతాబార్ న‌డుపుతున్న రాయ్‌లక్ష్మీ!