అనంతపురం జిల్లాలో ఏడు నెలల చిన్నారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అనారోగ్యంతో వున్న ఏడు నెలల చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్తున్న వాహనాన్ని ఆపివేయడమే ఇందుకు కారణమని.. అదీ కూడా అనంత, కల్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ కోసం ఏర్పాటు చేసిన స్వాగత సంబరాలే ఈ ఘటనకు కారణమైందని తెలుస్తోంది. దీంతో, ఆస్పత్రికి వెళ్లేసరికి పాప ఆరోగ్యం విషమించి ప్రాణాలు విడిచినట్లు వార్తలు వస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే.. శెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన.. ఈరక్క, గణేష్‌ల కూతురు పండు అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌కు ఫోన్ చేయగా అంబులెన్స్ రాలేదు. దీంతో బైక్‌పై కళ్యాణదుర్గం తీసుకెళ్తుండగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఎంతకీ వదలక పోవడంతో చిన్నారి రోడ్డుపైనే మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు ట్రాఫిక్‌ను అడ్డుకోవడం వల్లే తమ బిడ్డ చనిపోయిందని ఆరోపించారు చిన్నారి తల్లిదండ్రులు.
ఈ విషయంలో పోలీసుల వెర్షన్ మరోలా ఉంది.. మంత్రి స్వాగత సంబరాల సందర్భంగా.. తామెక్కడా వాహనాలను ఆపలేదంటున్నారు ట్రాఫిక్ జామ్ వల్లే చిన్నారి మృతి చెందిందనడంలో వాస్తవం లేదంటున్నారు.