Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ట్రంప్‌కు ఊడిన అధ్యక్ష పదవి!... విడాకులు దిశగా మెలానియా ఆలోచన?

ట్రంప్‌కు ఊడిన అధ్యక్ష పదవి!... విడాకులు దిశగా మెలానియా ఆలోచన?
, ఆదివారం, 8 నవంబరు 2020 (22:36 IST)
అమెరికా అధ్యక్ష పీఠానికి తాజాగా జరిగిన ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయభేరీ మోగించగా, ప్రస్తుత అధినేత, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ చిత్తుగా ఓడిపోయారు. అయితే, ఈ ఎన్నికల్లో తాను అలవోకగా గెలుస్తానని ట్రంప్ గట్టిగా విశ్వసించారు. ఆ విశ్వాసమే ఆయన కొంప ముంచింది. చివరకు తనకు పట్టున్న రాష్ట్రాల్లో సైతం ఆయన చిత్తుగా ఓడిపోయారు. ఫలితంగా ఆయన జనవరి నెలలో మాజీ అధ్యక్షుడు కానున్నారు. 
 
అయితే, ఇప్పుడు ట్రంప్ ఓటమి కంటే మరో అంశం అమెరికాలో ఎక్కువగా చర్చకు వస్తోంది. వైట్‌హౌస్‌ను ఖాళీ చేసి ట్రంప్ బయటకు వచ్చేసిన తర్వాత ఆయనకు విడాకులు ఇవ్వాలని మెలానియా ట్రంప్ భావిస్తోందట. అమెరికాలో ఈ అంశం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. సాక్షాత్తు ట్రంప్ మాజీ అనుయాయులు ఈ విషయం చెప్పినట్టు డెయిలీ మెయిల్ యూకే ఓ కథనంలో పేర్కొంది. 
 
మెలానియా ట్రంప్‌కు సీనియర్ సలహాదారుగా వ్యవహరించిన స్టెఫానీ వోల్కోఫ్‌ను ఉటంకిస్తూ... వైట్ హౌస్‌లో ట్రంప్ దంపతులకు వేర్వేరుగా బెడ్రూములు ఉండేవని, అసలు వారిద్దరిదీ అంశాల ప్రాతిపదికన జరిగిన ఒప్పంద వివాహం అని ఆ కథనంలో వివరించారు.
 
ఇక, మరో మాజీ ఒమరోసా మానిగాల్ట్ చెప్పిన వివరాల ఆధారంగా.... 15 యేళ్లకు పైగా సాగిన డొనాల్డ్ ట్రంప్, మెలానియాల దాంపత్యం ఇక ముగిసిందని ఆ కథనంలో తెలిపారు. ట్రంప్ వైట్ హౌస్ నుంచి ఎప్పుడు బయటికి వచ్చేస్తాడా అని మెలానియా ఘడియలు లెక్కిస్తోందని, ట్రంప్ పదవి నుంచి తప్పుకున్న వెంటనే మెలానియా విడాకులు ఇస్తుందని వివరించారు. 
 
కాగా, మెలానియా వయసు 50 ఏళ్లు కాగా, ట్రంప్ వయసు 74 ఏళ్లు. వీరిద్దరి దాంపత్యం ఏమంత సజావుగా లేదంటూ మీడియాలో బహిర్గతమైన అనేక దృశ్యాలు చెబుతాయి. ట్రంప్‌తో సఖ్యంగా ఉండేందుకు మెలానియా ఇష్టపడని అనేక ఘటనలు మీడియా కెమెరాల కంటికి చిక్కాయి. ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాల్లో ఎంతమేర వాస్తవం ఉందో తెలియాలంటే ట్రంప్ మాజీ అధ్యక్షుడు అయ్యేంత వరకు వేచివుండాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నంద్యాలలో సలాం ఫ్యామిలీ ఆత్మహత్య.. సీఐ సోమశేఖర్ అరెస్టు!