చదువుకోవడానికి ట్యూషన్‌కు వచ్చే చిన్నారులకు టిక్కెట్ల ఆశ చూపి లైంగిగ వేధింపులకు పాల్పడుతూ వచ్చిన ట్యూషన్ టీచర్ తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
దుర్గ్ జిల్లాకు చెందిన ఓ మహిళ ఉపాధ్యాయురాలు తన ఇంట్లో సాయంత్రం వేళలో ట్యూషన్ చెబుతోంది. దీంతో చుట్టుపక్కల వారు తమ పిల్లలను ఆమె వద్దకు ట్యూషన్‌కు పంపిస్తున్నారు.
అయితే, ఆ టీజచర్ ఇంట్లో పనులు చేసుకుంటుండగా ఆమె తండ్రి ఆ చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించసాగాడు. 11, 12 యేళ్ళ వయస్సున్న బాలికలకు చాక్లెట్ల ఆశ చూపి వారిని వేధించసాగాడు. దీంతో బాధిత బాలికలు తమ సమస్యను తల్లిదండ్రులకు చెప్పారు.
ఒకసారి ట్యూషన్ టీచర్ తండ్రికి వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ ఆయన తన వైఖరిని మార్చుకోకుండా, మరింతగా వేధింపులకు పాల్పడసాగాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.