Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్కా అంటూ మాటలు కలిపి అఘాయిత్యం.. ఎక్కడ?

Advertiesment
victimboy

ఠాగూర్

, గురువారం, 27 ఫిబ్రవరి 2025 (08:47 IST)
మహారాష్ట్రలోని పూణె నగరంలో ఓ మహిళ అత్యాచారానికి గురైంది. అక్కా అంటూ మాటలు కలిపిన ఓ కామాంధుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. నిందితుడుపై ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయి. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ ఘటనపై విపక్ష పార్టీల నేతలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీ నిర్భయ ఘటనను తలపిస్తుందని కాంగ్రెస్ మహారాష్ట్ర చీఫ్ హర్షవర్ధన్ అంటున్నారు. 
 
పూణెలోని ఓ బస్టాండులో బస్సు కోసం వేచి చూస్తున్న యువతి (26)తో మాటలు కలిపిన ఓ వ్యక్తి ఆమెను ఖాళీగా ఉన్న బస్సులోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పూణెలోని అతిపెద్ద బస్టాండులలో ఒకటైన స్వర్‌గేట్ బస్టాండులో రెండు రోజుల క్రితం ఉదయం ఆరు గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. పైగా, ఈ ఘటన జరిగిన ప్రదేశం పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో అంటే కేవలం వంద మీటర్ల దూరంలో ఉండటం గమనార్హం. 
 
బాధిత యువతి సతారా జిల్లాలోని తన స్వగ్రామం ఫల్టాన్‌ వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తుంది. ఆమె ఒంటిగా ఉన్న విషయాన్ని గమనించిన ఆ నిందితుడు అక్కా అంటూ ఆప్యాయంగా పిలుస్తూ మాటలు కలిపాడు. ఆమె ఎక్కడికి వెళ్లేదీ తెలుసుకున్నాడు. ఆ గ్రామానికి వెళ్లే బస్సు ఇక్కడ ఆగదని, మరోచోట ఉందంటూ మాయమాటలు చెప్పి, బస్టాండులోని దూరంగా నిలిచివున్న ఆర్టీసీ బస్సు వద్దకు తీసుకెళ్లాడు. 
 
ఆ తర్వాత బస్సు ఎక్కాలని చెప్పగా, బస్సులో లైట్లు ఆఫ్ చేసివుండటంతో ఆమె అనుమానించింది. అది గమనించిన నిందితుడు బస్సులో ప్రయాణికులు ఉన్నారని, నిద్రపోతుండటంతో లైట్లు ఆఫ్ చేశారంటూ బలవంతంగా ఆమెను బస్సు ఎక్కించాడు. ఆపై తనూ ఎక్కి తలుపులు వేసి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాధితురాలు తన ఊరికి వెళ్లే బస్సుల ఎక్కింది. అదే బస్సులో తన స్నేహితురాలిని చూసి జరిగిన విషయం చెప్పింది. 
 
ఆ యువతి సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పడంతో వెంటనే బస్సు దిగి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. బస్టాండులోని సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా నిందితుడు దత్తాత్రేయ రామదాస్‌ (36)గా గుర్తించారు. అతడిపై ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయని, 2019 నుంచి బెయిలుపై ఉన్నాడని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడుని పట్టుకునేందుకు ఎనిమిది పోలీస్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బూతుల ఎన్‌సైక్లోపీడియా పోసాని కృష్ణమురళి పాపం పండిందా?