Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొట్టుకుందాం రా: జుట్టుజుట్టూ పట్టుకుని కోర్టు ముందు పిచ్చకొట్టుడు కొట్టుకున్న అత్తాకోడళ్లు (video)

Advertiesment
Fight in front of Nasik court

ఐవీఆర్

, శుక్రవారం, 21 ఫిబ్రవరి 2025 (20:01 IST)
శాంతం అనేది సమాజంలో నానాటికీ క్షీణించిపోతున్నట్లు కనిపిస్తోంది. చిన్నచిన్న విషయాలనే పెద్దవిగా చేసుకుని కీచులాడుకోవడం ఎక్కువైపోతోంది. ఓర్పు అనేది నశించినట్లు తాజాగా వస్తున్న నేరపూరిత గణాంకాలను చూస్తే అర్థమవుతోంది. ఆస్తుల కోసం, కుటుంబ సంబంధాల విషయంలోనూ తేడా వస్తే శాల్తీలను లేపేస్తున్నారు. ఆ తర్వాత జైలు జీవితం దుర్భరంగా గడిపి దుఃఖిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే... మహారాష్ట్ర లోని నాసిక్ కోర్టుకి ఓ వివాద పరిష్కారం కోసం అత్తాకోడళ్లు కోర్టు మెట్లెక్కారు.
 
ఐతే కోర్టు లోపలికి వెళ్లకముందే అత్తాకోడళ్లు జుట్టూజుట్టూ పట్టుకున్నారు. అది చూసిన కోడలి సోదరుడు పౌరుషంతో పరుగులు పెడుతూ వచ్చాడు. ఐతే అత్త మాత్రం ఎంతకీ తగ్గేదేలే అన్నట్లు సూటిపోటి మాటలతో రెచ్చగొట్టింది. ఇక అంతే.. అత్తాకోడళ్లు ఒకరికొకరు జుట్లు పట్టుకుని కిందపడి కొట్టుకుంటూ దొర్లాడారు. విషయం కాస్త పెద్దది కావడంతో అటు కుటుంబం, ఇటు కుటుంబం సభ్యులు కూడా తమవంతుగా కొట్టుకున్నారు. ఇదంతా అక్కడే నిలబడిని పోలీసులు కాస్త వేడుకగా చూస్తూ వుండిపోయారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాటుకోడి తిందామనుకుంటే.. వాటికి కూడా బర్డ్ ఫ్లూ.. మటన్ ధరలు?